Samantha Ruth Prabhu Another Post On Instagram: కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత.. రీసెంట్‌గా ఒక పోస్ట్ పెట్టి వార్తల్లోకెక్కింది. తన పెంపుడు కుక్క ఫోటో పెట్టి, ‘డౌన్ అయ్యానే తప్ప ఔట్ అవ్వలేదు’ అనే క్యాప్షన్ పెట్టింది. అంటే.. తాను కాస్త ఆందోళనలో ఉన్నాననే విషయాన్ని ఆ పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పింది. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు మరో పోస్ట్ పెట్టింది. ఈసారి తన ముఖం చూపించకుండా.. ‘యు విల్ నెవర్ వాక్ ఎలోన్’ అని రాసి ఉన్న టీషర్ట్ ఫోటో పెట్టింది. దీనిపై కొందరు సెలెబ్రిటీలు స్పందిస్తూ.. హార్ట్ సింబల్స్ ఉన్న ఎమోజీలను షేర్ చేయడంతో పాటు ‘మోర్ పవర్ టు యు’ అంటూ ఆమెలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అటు.. అభిమానులు సైతం ‘మేమెప్పుడు మీ వెంటే ఉంటాం, మీరు ధైర్యంగా ఉండండి’ అంటూ బదులిస్తున్నారు.
కాగా.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం మౌనం పాటించిన సమంత, ఆ తర్వాత తిరిగి ఫుల్ జోష్‌తో తిరిగొచ్చింది. వరుసగా సినిమాలు చేయడంతో పాటు కాఫీ విత్ కరణ్ వంటి షోలలో పాల్గొంది. విడాకుల సమయంలో తానెంతో మనోవేదనకు గురయ్యానని, ఇప్పుడు మాత్రం పూర్తిగా కోలుకున్నానంటూ కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ, మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కొన్ని రోజులు సోషల్ మీడియాకి బ్రేక్ ఇచ్చి, ఇప్పుడు ఈ తరహా పోస్టులు పెడుతోంది. దీంతో.. సమంతకి ఏమైందా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. ఈమె సర్జరీ చేయించుకుందన్న రూమర్లతో పాటు ఆమె అనారోగ్యం బారిన పడిందన్న వార్తలూ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె మేనేజర్ ఆ వార్తల్లో వాస్తవం లేదని తోసిపుచ్చినా, రూమర్లు మాత్రం తగ్గడం లేదు. దీనిపై స్పష్టత రావాలంటే, సమంత బయటకొచ్చి స్పందించేదాకా వేచి చూడాల్సిందే!
ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. రెండు వెబ్ సిరీస్‌లతో పాటు పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలకు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే, బాలీవుడ్ వెండితెర తెరంగేట్రానికి కూడా ఈ అమ్మడు సిద్ధమవుతోంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో వచ్చిన క్రేజ్ కారణంగా.. పాన్ ఇండియా నటిగా అవతరించడంతో భారీ ఆఫర్లు ఒకదాని తర్వాత మరొకటి వచ్చిపడుతున్నాయి.
