Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. కొద్దిపాటి ఫాలోయింగ్ ఉన్న వారే సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫామ్స్ ను వాడేస్తుంటారు. కానీ సమంత కొన్ని రోజులుగా ఎక్స్ కు బ్రేక్ ఇచ్చింది. కేవలం ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ లోనే యాక్టివ్ గా ఉండేది. తాజాగా Xలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలం తర్వాత ఆమె ఎక్స్ లోకి రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆమెకు ట్విట్టర్ లో 10.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అంటే కోటి మందికి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు.
Read Also : Dandora: మరోసారి ‘కోర్ట్’ తరహా పాత్రలో శివాజీ?
రీ ఎంట్రీ ఇస్తూ తన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద స్వయంగా నిర్మించిన శుభం సినిమాను ఫస్ట్ పోస్టు చేసింది. ఇందులో సమంత శుభం సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సి.మలిరెడ్డి, శ్రీయ కొంఠెం, చరణ్ పెరి, షాలిని కొండెపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్రర్ కామెడీ మూవీగా రాబోతోంది. మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. తాను నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్ల కోసం ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి దీని తర్వాత కూడా ఎక్స్ లో కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి. సమంత ప్రస్తుతం ఓ పెద్ద సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.