Samantha: సమంత మళ్లీ ఆసుపత్రిపాలు.. అప్డేట్ ఇచ్చిన మేనేజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Manager Gives Clarity On Her Health Condition: తాను మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డానని, అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని కొన్ని రోజుల క్రితం సమంత సోషల్ మీడియా మాధ్యమంగా వెల్లడించిన విషయం తెలిసిందే! అప్పట్నుంచి సమంత ఆరోగ్యం గురించి అందరూ ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఎందుకంటే.. అది పూర్తిగా నయమయ్యే వ్యాధి కాదు. దానికి తరచుగా చికిత్స తీసుకుంటూనే ఉండాలి. సమయానుసారంగా మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా.. తాను ఈ వ్యాధితో పోరాడి, ఆరోగ్యంగా తిరిగొస్తానని సమంత ఆవేదనతో చెప్పడాన్ని బట్టి చూస్తే, ఈ వ్యాధితో ఆమె ఎంతలా బాధపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ, యశోద ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత కాస్త జోష్‌తోనే కనిపించింది.
అయితే.. ఇంతలోనే ఓ షాకింగ్ న్యూస్ తెరమీదకి వచ్చింది. మయోసైటిస్ కారణంగా సమంత ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని, దీంతో ఆమె చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిందన్నదే ఆ వార్త సారాంశం. తమిళనాడులో ఈ వార్త తెగ చక్కర్లు కొట్టింది. రెండు, మూడు రోజుల నుంచి సమంత కూడా యాక్టివ్‌గా కనిపించకపోయేసరికి, ఈ వార్త నిజమేనేమోనని ఫ్యాన్స్ అందరూ కంగారు పడ్డారు. సమంత కోలుకోవాలని ప్రార్థనలు చేయడం కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఆందోళన దూరమయ్యేలా, సమంత మేనేజర్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. సమంత ఆరోగ్యం క్షీణించినట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ఆమె ఏ ఆసుపత్రిలోనూ చేరలేదని స్పష్టం చేశాడు. సమంత చాలా ఆరోగ్యంగానే ఉందని, మునుపటిలాగే ఫుల్ జోష్‌తో జిమ్‌కి వెళ్లి కసరత్తులు సైతం చేస్తోందని క్లారిటీ ఇచ్చాడు. ఎలాంటి వదంతుల్ని నమ్మొద్దని సూచించాడు.
Also Read
శ్రీదేవి శ్రీధర్ అనే సినిమా జర్నలిస్ట్ కూడా సమంత ఆరోగ్యంగానే ఉందని ట్విటర్ మాధ్యమంగా కన్ఫమ్ చేశారు. ఆమె ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తను ఆరోగ్యంగానే ఉందని, ఫుల్ జోష్‌తో ఆడిపాడుతోందని ఆమె సన్నిహితులు తెలియజేసినట్లు పేర్కొంది. తప్పుడు వార్తల్ని ప్రచారం చేయొద్దని వెల్లడించారు. కాబట్టి.. సమంత ఆరోగ్యంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
There is a news doing the rounds about @Samanthaprabhu2 and her health. Sources close to her confirm that she is absolutely fine and is doing good. Pl do not spread wrong information. pic.twitter.com/STtZOJVDta
— sridevi sreedhar (@sridevisreedhar) November 24, 2022
తాజావార్తలు
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!