Samantha: సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా కథను బట్టి అమ్మడురూపు రేఖలను మార్చేస్తోంది. ఇప్పటికే హాలీవుడ్ మూవీ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మధ్యన సామ్ గురించి రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఆమె సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిందని, చర్మ సంబంధింత సమస్యలతో బాధపడుతుందని కథనాలు వెలువడ్డాయి. కానీ, అందులో ఎటువంటి నిజం లేదని సామ్ మేనేజర్ తేల్చి చెప్పాడు.
ఇక చాలా గ్యాప్ తరువాత సమంత ఒక డాగ్ యాడ్ లో కనిపించి మెప్పించింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ లో క్లివేజ్ అందాలను ఎరగా వేసి అద్భుతంగా ఉంది. అయితే ఈ ఫోటోలు చూసిన వారందరు సామ్ ఫేస్ లో ఎంతో తేడా ఉందని చెప్పుకొస్తున్నారు. కొంతమంది ఆమె లావు అయ్యిందని చెప్తుంటే.. మరికొంతమంది సామ్ లో అంతకుముందు ఉన్న కళ కనిపించడం లేదని చెప్పుకొస్తున్నారు. సడెన్ గా ఆమెను చూసి సమంతనా అని ఆశ్చర్యపోయినట్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి అమెరికాలో జరిగిన సర్జరీ వలనే సామ్ ఫేస్ ఇలా అయ్యిందా..? అనేది తెలియాల్సి ఉంది.