Site icon NTV Telugu

Samantha: ఇక సామ్ లైఫ్ సెట్ అయిపోయినట్లేనా.. ఆ మధుర క్షణాలు ఏంటి..?

saamntha

saamntha

సమంత.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోను అమ్మడు పాగా వేయబోతుంది. ఇక భర్త నాగ చైతన్యతో విడిపోయిన తరువాత సామ్ కొద్దిగా డిప్రెషన్ లో కనిపిస్తూ వచ్చింది. ప్రతి ఫోటోషూట్ లోను ఏదో మిస్ అయినా ఫీలింగ్ ఉందంటూ అభిమానులు చెప్పకనే చెప్పేస్తారు. విడాకులు అంటే చిన్న విషయమేమి కాదు. ఆమె ఎదుర్కున్న ట్రోలింగ్ కూడా మామూలుది కాదు. వాటన్నంటినీ బ్యాలెన్స్ చేస్తూ మరోపక్క సినిమాలతో బిజీగా ఉంటూ ఎంతో స్ట్రాంగ్ గా మారింది. నిత్యం సోషల్ మీడియాలో తనలోని భావాలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.

తాజాగా సామ్ ఒక అందమైన ఫోటోను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ లో వున్న ఈ ఫొటోలో సామ్ చిరు మందహాసంతో ఆలోచిస్తూ ఎంతో అందంగా కనిపించింది. ఆ ముగ్ద మనోహర రూపానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇక అంతకు ముందు కన్నా అమ్మడి ఫేస్ లో కొద్దిగా మార్పు కనిపిస్తుంది.. ముఖం వెలిగిపోతుంది. సెట్ లైఫ్ అంటూ ఈ ఫొటోకు పేరు పెట్టిన సామ్ .. మధ్యలో మధుర క్షణాలు అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం సామ్ మోనోక్రోమ్ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంతకీ సామ్ లైఫ్ సెట్ అయినట్లేనా.. అంటే నిజమనే అంటున్నారు నెటిజన్లు .. ఇప్పుడిప్పుడే సామ్ బయటికొస్తుందని చెప్పుకొస్తున్నారు. మరి సామ్ అంతగా ఆలోచించే ఆ మధుర క్షణాలు ఏంటి..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం సామ్ తెలుగులో యశోద, శాకుంతలం చిత్రాలతో పాటు కాతువాకుల రెండు కాదల్ చిత్రం లో నటిస్తోంది.

Exit mobile version