టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల ద్బుతం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న తేజ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇకపోతే తేజకు, హీరోయిన్ సమంతకు మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి ఓ బేబీ సినిమాలో నటించారు. అప్పటినుంచి తేజకు సామ్, డైరెక్టర్ నందిని రెడ్డి సపోర్ట్ గా నిలుస్తున్న సంగతి తెల్సిందే.
ఇక తాజాగా తేజకు సోషల్ మీడియాలో చుక్కలు చూపించింది. తేజ తన లేటెస్ట్ ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ `ఎక్స్ క్యూజ్ మీ లేడీస్` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ పోస్ట్ చూసిన సమంత “అంటే? ఒక్క చిత్రం కోసం ఆహ్.. అంత ఈజీ అనుకున్నావా? మనం అతనికి ఏమీ నేర్పించలేదా?” అంటూ నందిని రెడ్డి మీద సీరియస్ అయింది. దీనికి నందిని రెడ్డి నవ్వుతున్న ఎమోజిస్ ని షేర్ చేయగా తేజ ” మీరు నా మొత్తం స్వాగ్ ని నాశనం చేసారని” ఫీల్ అవుతూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఏది ఏమైనా ఒక్క సినిమాతోనే తేజ అంత పాపులారిటీని సంపాదించుకున్నాడు అంటే అతిశయోక్తి కాదు. ఇక సామ్ కామెంట్ తేజకి బూస్టింగ్ లా పనికొస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం సరదాగా ఆట పట్టించిన తేజ కు సామ్ ఎప్పుడూ సపోర్ట్ గా నిలబడుతుంది అని తేజ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.
