Site icon NTV Telugu

Samantha : ఆ పని నేను కావాలని చేయలేదు.. అలా జరిగిపోయింది

samantha

samantha

టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఉండే ఈ భామ విడాకుల తరువాత నుంచి పోస్ట్ చేసే పోస్టులు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి. అయితే ఆ పోస్టులకు, వీడియోల వెనుక ఉన్న కారణం ఏంటి..? సామ్ ఏం ఫీల్ అవుతుంది అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఇక ఇటీవలఎయిర్ పోర్ట్ లో సామ్ వేసిన అరబిక్ కుత్తు డాన్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు. గతంలో పూజా హెగ్డే తో గొడవ పెట్టుకున్న సామ్ అన్ని మర్చిపోయి ఆమె నటించిన సాంగ్ కి డాన్స్ వేయడంపై పలు అనుమానాలు పుట్టుకొచ్చాయి. వీళ్లిద్దరి మధ్య క్లాషెస్ తగ్గిపోయాయ్న్తు చెప్పుకొచ్చారు. అయితే తాజగా సామ్ ఆ వీడియో చేయడంపై క్లారిటీ ఇచ్చింది.

“ఎయిర్ పోర్ట్ లో ఉన్న సమయంలో బీస్ట్ అరబిక్ కుత్తు వీడియోను చూశాను. చూడగానే చాలా నచ్చింది. అందుకే వెంటనే డాన్స్ చేయాలనిపించింది. ఏమాత్రం ఆలోచించకుండా ఆ పాటకు డాన్స్ చేశా ” అని చెప్పుకొచ్చింది. అయితే ఈ సాంగ్ నచ్చి సామ్ చేసింది. అందులో ఎవరు నటించారు అనేది ఆమెకు అనవసరం కదా అని కొందరు అంటుండగా.. హీరో విజయ్, సామ్ కి మంచి స్నేహ బంధం ఉంది. ఆ కారణంగా కూడా సామ్ ఈ సాంగ్ కి డాన్స్ చేసి ఉండొచ్చు అని మరికొందరు అంటున్నారు. ఏదిఏమైనా సామ్ హ్యాపీగా ఉంటే అదే చాలు అని సామ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version