మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో హడావిడిగా ఉన్న విషయం తెలిసిందే. భార్య ఉపాసన చెల్లెలు అనుష్పల- అర్మాన్ ల వివాహం గ్రాండ్ గా జరుగుతుంది. ఈ వివాహ ఏర్పాట్లు అన్ని రామ్ చరణ్ – ఉపాసన దంపతులే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుక వలనే చెర్రీ ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ కి హాజరుకాలేకపోయాడు. ఇకపోతే ఈ పెళ్లి వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత , ఆమె స్నేహితురాలు శిల్పా రెడ్డి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రామ్ చరణ్ కు , ఉపాసనకు సామ్ మంచి స్నేహితురాలు.. ఇక ఉపాసన, సామ్ స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో చెల్లి వివాహానికి స్పెషల్ గెస్ట్ ల లిస్ట్ లో సామ్ ని ఆహ్వానించింది ఉపాసన. పెళ్ళిలో రామ్ చరణ్, ఉపాసన, శిల్పా రెడ్డితో సామ్ సందడి చేసింది. నూతన దంపతులతో ఫొటోలకు పోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
