Site icon NTV Telugu

Russia Ukraine War : సామ్, కాజల్ ఎమోషనల్ పోస్టులు

Kajal

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాగతాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్‌లో జరుగుతున్న ప్రస్తుత సంఘటనల గురించి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి సోషల్ మీడియాలోనూ తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు సమంత, కాజల్ అగర్వాల్ వంటి సౌత్ సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ విషయంపై సమంతా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టును షేర్ చేసింది.

Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా…

“ఒకేవేళ మీరు దీన్ని చదువుతుంటే ప్రపంచంలో శాంతి గురించి ప్రార్థించండి. ఆ శాంతి అందరి హృదయాలలో, ఇళ్లలో నిండాలని కోరుకోండి. ప్రతి ఒక్కరూ శాంతి, ఆనందంతో జీవించడానికి అర్హులు #ఉక్రెయిన్” అంటూ పాపులర్ సింగర్ చిన్మయి షేర్ చేసిన పోస్టును పంచుకుంది. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులపై కాజల్ అగర్వాల్ ఓ వీడియోను కూడా పంచుకుంటూ హార్ట్ బ్రోకెన్ ఎమోజీని షేర్ చేసింది. ఉక్రెయిన్‌లో పరిస్థితి భయానకంగా ఉందని, సంక్షోభం కారణంగా అమాయక ప్రజలు భయంతో జీవిస్తున్నారని గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా షేర్ చేసిన వీడియోను కాజల్ రీపోస్టు చేసింది.

Exit mobile version