Samajavaragamna : ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ప్రకటించిన ఆహా ఓటీటీ సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సామజవరగమన. ఈ సినిమా జూన్ 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ప్రతీ ప్రేక్షకుడు సినిమా చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేసారు.ఈ సినిమాలో ముఖ్యంగా సీనియర్ నరేష్ క్యారెక్టర్ అద్భుతం అని చెప్పాలి. ఆయన క్యారెక్టర్ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా సామజవరగమన సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. సుమారు రూ.7కోట్ల బడ్జెట్‌తో తెరెక్కిన ఈ సినిమా నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ సామజవరగమన ను సినిమాకు ప్రేక్షకులు వెళ్తూనే వున్నారు.థియేటర్ లలో హౌస్ ఫుల్ బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి.. అలా మోస్ట్ ఎంటర్‌టైనింగ్ మూవీ గా నిలిచిన సామజవరగమన ఓటీటీ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈక్రమంలో జులై 28న సామజవరగమన సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. ఆహా సంస్థ ఈ మేరకు సోషల్ మీడియా లో ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.’నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒక యోగం. సామజవరగమన దానికి చక్కటి రూపం. ఇక నో ఆలస్యం..ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం’ అంటూ సామజవరగమన ఓటీటీ విడుదల తేదిని అనౌన్స్ చేసింది ఆహా. ఈ సినిమాను రామ్ అబ్బరాజు తెరకెక్కించారు.ఈ సినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించింది..సుదర్శన్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా సామజవరగమన సినిమాను నిర్మించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీ లో చూసేయాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Also Read
- Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
- God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
- Sunil Narang: 'ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి' ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
- Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
తాజావార్తలు
-
Modi-Meloni Selfie Goes Viral: వైరల్‌గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
-
Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
-
Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?