Site icon NTV Telugu

ఆర్యన్ అరెస్ట్ తర్వాత షారూఖ్‌ను పరామర్శించిన సల్మాన్

Salman Khan Visited Shah Rukh Khan's House after Aryan Khan Arrest

ఇటీవల ముంబైలో షిప్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఆర్యన్ ఇప్పటికీ ఎన్‌సిబి అధికారుల అదుపులోనే ఉన్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆదివారం షారూఖ్‌ని కలసి పరామర్శించారు. షారుఖ్ ఇంట్లో సల్మాన్ దాదాపు గంట టైమ్ స్పెండ్ చేశాడు. ఆర్యన్ అరెస్టుకు సంబంధించి షారూఖ్ ని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్, షారూఖ్ మంచి స్నేహితులే కాదు పలు చిత్రాల్లో కలిసి నటించారు. అంతే కాదు షారుఖ్ రాబోయే చిత్రం ‘పఠాన్‌’లో అతిధి పాత్రలో నటించాడు సల్మాన్. ఆర్యన్ ఖాన్‌ తో పాటు అర్బాజ్ సేథ్ మర్చంట్, మున్మున్ ధమేచా అనే మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇప్పటికీ రిమాండ్ లో ఉన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చట్టంలో సెక్షన్ 8 (c), 20 (b), 27, 35 మీద వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఆర్యన్ తరపున న్యాయవాది సతీష్ మనేషిండే సోమవారం బెయిల్ కి దాఖలు చేశారు.

Read Also : గాయాల పాలైన రామ్… ఆగిన షూటింగ్

Exit mobile version