గాయాల పాలైన రామ్… ఆగిన షూటింగ్

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గాయాల పాలయ్యారు. ప్రస్తుతం రామ్ “రాపో19” అనే సినిమా చేస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో “రాపో19” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ‘రాపో19’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుండగా… లింగుసామికి డైరెక్టర్ గా తెలుగులో ఇదే మొదటి మూవీ. ఈ చిత్రంతో రామ్ తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా కోసమే రామ్ భారీగా వర్కౌట్లు చేస్తున్నాడు.

Read Also : “ప్రభాస్ 25” అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే ?

సినిమాలో తన పాత్రకు అవసరమైన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి జిమ్ లో గంటలు గంటలు కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ మెడకు బలమైన గాయం అయినట్టు సమాచారం. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే రామ్ డబుల్ ఎనర్జితో తిరిగి వస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం “రాపో19” షూటింగ్ ను పక్కన పెట్టారు. రామ్ పూర్తిగా కోలుకున్నాక తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతుంది.

-Advertisement-గాయాల పాలైన రామ్… ఆగిన షూటింగ్

Related Articles

Latest Articles