Site icon NTV Telugu

God Father: చిరుకు కండిషన్ పెట్టిన సల్మాన్.. అలా చేస్తే సెట్ నుంచి వెళ్లిపోతానంటూ

Chiranjeevi

Chiranjeevi

కండల వీరుడు సల్మాన్ ఖాన్ పైకి ఎంత రూడ్ గా కనిపించినా.. ఎన్ని వివాదాలలో చిక్కుకున్న ఆయన మనసు వెన్న.. ఒక్కసారి ఎవరినైనా తన స్నేహితుడు అనుకున్నాడు అంతే లైఫ్ లాంగ్ ఆ స్నేహాన్ని కొనసాగిస్తాడు. ఇక ఆ రిలేషన్ కోసం ఏదైనా చేస్తాడు.. తాజాగా మరోసారి సల్మాన్ తన స్నేహ బంధాన్ని నిరూపించాడు. సల్మాన్ ఖాన్ కి, మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. చిరంజీవి అంటే ఆయనకు అమితమైన గౌరవం.. ప్రేమాభిమానాలు.. ఇక చరణ్, సల్లు భాయ్ అన్నదమ్ముల్లాగా కనిపిస్తారు. ఈ స్నేహ బంధంతోనే చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ లో సల్లు భాయ్ ఒక గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరుని అధికారికంగా ప్రకటించారు.

ఇక సల్మాన్ ఇటీవలే ఈ సినిమా సెట్ లో అడుగుపెట్టిన సంగతి తెల్సిందే. ఇక ఈ గెస్ట్ పాత్రకు రెమ్యూనిరేషన్ తీసుకోనని చిరుకు కండిషన్ పెట్టాడట సల్లు భాయ్. ఒకవేళ బలవంతంగా పారితోషికం ఇస్తాను అంటే సెట్ నుంచి వెళ్లిపోతానని చెప్పారట.. కేవలం ఈ పాత్ర చిరు మీద అభిమానంతో మాత్రమే చేస్తున్నానని, డబ్బు కోసం కాదని చెప్పుకొచ్చాడంట. అతని ఉదాత్త హృదయాన్ని చూసి నిర్మాతలు సైతం ఆశ్చర్యపోయారట . నిజం చెప్పాలంటే సల్మాన్ అడగాలే కానీ కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మాతలు.. అయినా సల్లూ భాయ్ స్నేహానికి విలువ ఇచ్చి పారితోషికాన్ని తృణప్రాయంగా త్యజించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా మా సల్లు భాయ్ మనసు గొప్పది అంటూ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.

Exit mobile version