నిన్న రాత్రి ముంబైలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో బిగ్ అనౌన్స్మెంట్ కు వేదికైంది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన సల్మాన్ ఖాన్ అభిమానులకు ఇది శుభవార్త. డిసెంబర్ 19న సూపర్ స్టార్ తన హిట్ చిత్రం ‘భజరంగీ భాయిజాన్’ రెండో భాగాన్ని ‘ఆర్ఆర్ఆర్’ వేదికపై అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సల్మాన్ కెరీర్లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్, రామ్ చరణ్, కరణ్ జోహార్ సమక్షంలో ముంబైలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్లో సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయిజాన్ ‘ కొత్త సీక్వెల్‌ను ధృవీకరించారు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ స్క్రిప్ట్ రాశారని సల్మాన్ వెల్లడించారు.
Read Also : “బిగ్ బాస్ 5” టైటిల్ ను కైవసం చేసుకున్న సన్నీ
‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ సందర్భంగా రాజమౌళి తండ్రి తన కెరీర్లో అత్యుత్తమ చిత్రాలలో ఒకదాన్ని ఎలా ఇచ్చాడనే విషయం గురించి మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ ఈ ఆశ్చర్యకరమైన అప్డేట్ ను రివీల్ చేసాడు. దానికి చిత్రనిర్మాత కరణ్ జోహార్ స్పందిస్తూ “అయితే ఇది సినిమా అధికారిక ప్రకటన అని మనం చెప్పొచ్చా ?” అని అడిగాడు. దానికి సల్మాన్ స్పందిస్తూ “అవును, కరణ్” అన్నాడు. గమనించదగ్గ విషయం ఏమిటంటే ‘భజరంగీ భాయిజాన్’ భారతదేశంలోని బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికి బాలీవుడ్ లో టాప్ 5 వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా ఈ మూవీ ఉండడం విశేషం. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్దిఖి కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2015 జూలై 17న థియేటర్లలో విడుదలైంది.