Salman Khan: ట్రోల్స్‌కు సిక్స్‌ప్యాక్‌తో సమాధానం.. 60 ఏళ్లకూ సల్మాన్ స్టామినా ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్నెస్ తగ్గిపోతుందనే భావనను మరోసారి తప్పు అని నిరూపించారు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్. ఇటీవల ఆయన లుక్ పై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్‌కు ఎలాంటి మాటలు లేకుండానే గట్టి సమాధానం ఇచ్చారు. జిమ్‌లో వర్కౌట్ అనంతరం షర్ట్‌లెస్‌గా దిగిన రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన ఫిట్నెస్తోనే అందరినీ ఆశ్చర్యపరిచారు. తెల్లవారుజామున సుమారు 3 గంటలకు ఈ ఫొటోలను పోస్ట్ చేసిన సల్మాన్, కండలు తిరిగిన శరీరం, సిక్స్‌ప్యాక్ తో అభిమానులను ఫిదా చేశారు. ఫొటోలతో పాటు ‘సల్మాన్ ఖాన్ డర్ర్ర్ర్ గయా… హ్మ్మ్… జో డర్ గయా వో మర్ గయా’ అంటూ ఆయన రాసిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఆయన ఆరోగ్యం, లుక్ పై వచ్చిన విమర్శలకు ఇదే సమాధానమని అభిమానులు భావిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ లుక్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందంటూ ట్రోల్ చేశారు. అయితే లేటెస్ట్ జిమ్ ఫొటోలతో సల్మాన్ మరోసారి తన ఫిట్‌నెస్‌పై ఎలాంటి రాజీ లేదని నిరూపించారు. దీంతో అభిమానులు ‘భాయ్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇటీవల నీట్ పరీక్ష వివాదంపై నిరసనలు చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతూ, వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇళ్లకు వెళ్లాలని సూచిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అలాగే నిరాహార దీక్ష చేస్తున్న కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతూ దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా వైరల్ అయిన ఫిట్నెస్ ఫొటోలతో సల్మాన్ మరోసారి తనపై వస్తున్న విమర్శలకు స్టైలిష్‌గా కౌంటర్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.
Also Read
- Viswanath And Sons: సూర్య సినిమాకు జ్యోతిక టచ్.. రిలీజ్ తర్వాతే ఆ సీక్రెట్ రివీల్!
- Uyir OTT Release: రియల్ పోలీస్ రాసిన కథ.. ఓటీటీలోకి వస్తున్న మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'ఉయిర్'!
- Tamannaah Bhatia: దక్షిణాదిలో ఆంక్షలు.. హిందీలో స్వేచ్ఛ.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
- Love O Love OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీలోకి 'లవ్ ఓ లవ్'.. ధనుష్ మేనల్లుడు సినిమా ఎక్కడ చూడాలంటే?
ఇక సినిమాల విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుండగా, షూటింగ్ కొనసాగుతోంది. మరోవైపు 2020 గాల్వాన్ లోయ ఘటనల నేపథ్యంలో రూపొందుతున్న ‘మాతృభూమి’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
Salman Khan darrrrr Gaya…. Hmmmm Joe darr gaya vo mar gaya.. pic.twitter.com/CPTQpxWRsP
— Salman Khan (@BeingSalmanKhan) July 24, 2026
- Tags
- cinema
- Salman Khan
తాజావార్తలు
-
Salman Khan: ట్రోల్స్‌కు సిక్స్‌ప్యాక్‌తో సమాధానం.. 60 ఏళ్లకూ సల్మాన్ స్టామినా ఇదే!
-
Mohan Bhagwat: “నేటి తరం దారి తప్పలేదు”.. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
-
Samsung Galaxy F70 Pro: సామ్ సంగ్ గెలాక్సీ F70 ప్రో.. 6000mAh బ్యాటరీ, Snapdragon 6 Gen 3 చిప్సెట్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా?.. కేంద్రానికి CJP డెడ్‌లైన్.. ఢిల్లీలో హై అలర్ట్!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!