Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక మొదటి వారంలోనే 500 కోట్ల మార్క్ ని చేరుకున్న సలార్ సినిమా, సెకండ్ వీక్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మంచు ఆకుపెన్సీని మైంటైన్ చేస్తోంది. నేటికీ ఈ సినిమా 623 కోట్ల మార్క్ ను అందుకుంది. ఇక ఏ సినిమా రిలీజ్ అయినా కూడా.. సినిమాపై హైప్ పెంచడానికి అందులోని మంచి మంచి సీన్స్ ను ప్రోమోగా వదులుతూ ఉంటారు. అయితే ఎక్కడా హైలైట్ అయినా సీన్స్ కానీ, ట్విస్ట్ లు కానీ రివీల్ చేయరు. కానీ, హోంబలే మాత్రం సలార్ లోని హైలైట్ సీన్స్ అన్ని ప్రొమోలుగా రిలీజ్ చేస్తున్నారు.
కాటేరమ్మ ఫైట్ సీన్, దేవా, వరద ఫైట్ సీన్, దేవా ఎంట్రీ సీన్ ఇలా మొత్తం ప్రొమోలుగా వదిలారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.అరేయ్.. సినిమా మొత్తం ప్రోమోలో ఇచ్చేస్తే ఎలారా.. ? ఇంకా సినిమా చూడడానికి ఎవడు వెళ్తాడు అని చెప్పుకొస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యి పదిరోజులు కూడా కాలేదు. బ్రేక్ ఈవెన్ కలక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఎంత హైప్ ఇచ్చినా డార్లింగ్ అభిమానులు వరకు ఓకే.. మిగతా ప్రేక్షకుల కోసమైనా ఇలాంటి సీన్స్ బయటకి రాకుండా చూస్తే బావుంటుంది అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. ఇప్పటికే సోషల్ మీడియాలో థియేటర్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. కానీ, ప్రోమోల్లో మీరు కూడా రిలీజ్ చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరి సలార్ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది చూడాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.