యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ ని పూర్తిచేసిన డార్లింగ్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, సలార్ ను ముగించే పనిలో పడ్డాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక మలయాళ స్టార్ హీరో వెనుక ప్రభాస్ పడుతున్నాడట.. సలార్ లో ఆ హీరో నటించాల్సి ఉండగా అనుకోని కారణాల వలన అతడు తప్పుకుంటే.. ఏకంగా ప్రభాసే రంగంలోకి దిగి అతడిని ఒప్పించి ఈ సినిమాలో నటించేలా చేస్తున్నాడట.
డార్లింగే ఒప్పించిన ఆ హీరో ఎవరు అంటే.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈ హీరో సలార్ లో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడట.. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్నిరోజుల క్రితం సలార్ లో నాకు అవకాశం వచ్చింది. నేను కూడా పాత్ర నచ్చడంతో ఓకే చెప్పాను. కానీ ఆ తరువాత కొన్ని కారణాల వలన నేను తప్పుకోవాల్సి వచ్చింది. కానీ.. ఆ పాత్రకు నన్నే అనుకోవడం ప్రశాంత్.. మీరే చేయాలి అని పట్టుబట్టాడు. తరువాత ప్రభాస్ కూడా నన్ను నేరుగా కలిసి ఆ పాత్ర చేయండి అని చెప్పాడు. దీంతో నేనే నా డేట్స్ ని అడ్జెస్ట్ చేసుకొని సలార్ లో నటిస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా ప్రభాస్ వెంటపడి మరీ తీసుకొచ్చాడంటే పృథ్వీరాజ్ పాత్ర కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ప్రభాస్ కి ధీటుగా వేలం గా ఏమైనా ఈ హీరో కనిపించబోతున్నాడేమో చూడాలి.