ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయాలి అంటే భారీ బడ్జెట్ లు, ఎక్కువ టైం పీరియడ్ కావాలి. ఈ రెండు కారణాల వల్లే ప్రభాస్ సినిమాలు డిలే అవుతూ ఉంటాయి. గత పదేళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ గతంలో చెప్పినా, అది వర్కౌట్ అవ్వట్లేదు. అనౌన్స్ చేసిన సమయానికి సినిమాల షూటింగ్ కంప్లీట్ అవ్వట్లేదు, షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమలకేమో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో పడుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా ఈ కేటగిరిలోకే చేరుతుంది. 2023 సంక్రాంతికి షెడ్యూల్ అయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ డిలే అవుతుండడంతో పోస్ట్ పోన్ అయ్యింది. సంక్రాంతి నుంచి తప్పిస్తూ సమ్మర్ బరిలో ఆదిపురుష్ సినిమాని నిలబెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు కానీ 2024 వరకూ ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం కనిపించట్లేదని సమాచారం. ఇక ప్రభాస్ నుంచి 2023లో సినిమా రావడం కష్టమేనా అనుకుంటున్న టైంలో లైం లైట్ లోకి వచ్చింది ‘సలార్’.
KGF సీరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ సెట్స్ నుంచి లీక్ అయిన ప్రతి ప్రభాస్ ఫోటో, మాస్ ర్యాంపేజ్ ని గుర్తు తెచ్చేలా ఉంది. ఇది చాలదన్నట్లు మేకర్స్ ఫస్ట్ లుక్ తో చిన్న సైజ్ వార్ నే చూపించారు. ప్రభాస్ ని అంత హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో చూసి చాలా కాలమే అయ్యింది. ఆదిపురుష్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడంతో, సలార్ సౌండ్ కాస్త తగ్గింది కానీ ఆదిపురుష్ రిలీజ్ వాయిదా పడడటంతో ఇప్పుడు అందరి దృష్టి మళ్లీ సలార్ పైకి షిఫ్ట్ అయ్యింది. ఈ మూవీ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. సలార్ సినిమా సెప్టెంబర్ నెల చివరి గురువారం రిలీజ్ అవనుండడంతో అయిదు రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ దొరుతోంది. నాన్ హాలీడే రోజు వస్తేనే ప్రభాస్ 100 కోట్ల ఓపెనింగ్ బెంచ్ మార్క్ సెట్ చేస్తాడు అలాంటిది అయిదు రోజులు వీకెండ్ ఎండ్ అంటే ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.