రెబల్ స్టార్ ప్రభాస్… సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సలార్ సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతూ కొత్త రికార్డులని క్రియేట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఏ సినిమాకైనా రీచ్ అవ్వడానికి చాలా టైమ్ పట్టే రేంజులో న్యూ బెంచ్ మార్స్ ని సెట్ చేస్తున్నాడు ప్రభాస్. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తున్న సలార్ సినిమా ఒక రీజన్ లో మాత్రం సౌండ్ చెయ్యట్లేదు. కర్ణాటకలో సలార్ బాగానే ఉంది, తమిళనాడులో కూడా సలార్ మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది… అయితే కేరళలో మాత్రం సలార్ సినిమా అసలు సౌండ్ చెయ్యట్లేదు. తెలుగు రాష్ట్రాల మినహా మిగిలిన సౌత్ స్టేట్స్ లో సలార్ పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు, మరీ ముఖ్యంగా కేరళలో సలార్ చాలా వీక్ గా ఉంది. డే 1, డే 2 రెండు రోజుల కలెక్షన్స్ కలిపినా కూడా కనీసం పది కోట్లని రాబట్టలేకపోయింది సలార్ సినిమా.
పాన్ ఇండియాలో ఇంతమంది హీరోలు ఉన్నా కూడా ప్రభాస్ పక్కన ప్రభాస్ అంత పవర్ ఫుల్ రోల్ ని మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కి ఇచ్చాడు ప్రశాంత్ నీల్. పృథ్వీరాజ్ కూడా తన పాత్రని సూపర్బ్ గా ప్లే చేసాడు. ఎమోషనల్ సీన్స్ లో పృథ్వీ… వరదరాజ మన్నార్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అనేలా ఉన్నాడు. ఈరోజు పాన్ ఇండియా ఆడియన్స్ పృథ్వీరాజ్ పెర్ఫార్మెన్స్ కి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే… కేరళ ఆడియన్స్ ఇంతపెద్ద సినిమాలో మా హీరోకి హీరో రేంజ్ క్యారెక్టర్ పడిందే అనే ఆలోచన కూడా లేకుండా ఉన్నారు. ప్రభాస్ కోసం కాకపోయినా తమ హీరోని పాన్ ఇండియా ఆడియన్స్ ఆకాశానికి ఎత్తుతున్నారు అనే గర్వంతో అయినా మలయాళ ఆడియన్స్ సలార్ సినిమాని చూడాలి. నిజానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కన్నా సలార్ సినిమాకి మలయాళ కలెక్షన్స్ ఎక్కువగా ఉండాలి కానీ మలయాళ ఆడియన్స్ సలార్ ని ఆశించిన స్థాయిలో ఆదరించట్లేదు.