Saindhav: విక్టరీ వెంకటేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో వెంకీ మామను కొట్టేవారే లేరు. ఇప్పటికీ కుటుంబకథా చిత్రాల హీరోగా వెంకీకి మంచి గుర్తింపు ఉంది. ఇక తాజాగా వెంకీ 75 గా సైంధవ్ గా తెరకెక్కింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకీ సరసన శ్రద్ద శ్రీనాధ్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బుజ్జికొండవే అంటూ సాయిగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
కూతురు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆమెను ఎంత హ్యాపీగా ఉంచాలో అంత హ్యాపీగా ఉంచడానికి ఒక కన్నతండ్రి ఏం చేశాడు అనేది ఈ సాంగ్ లో చూపించారు. రామజోగయ్య శాస్త్రి తన అద్భుతమైన లిరిక్స్ సన్నివేశాన్ని మనసును హత్తుకునేలా చేశాయి. ఎస్పీ చరణ్ తన మ్యాజికల్ వాయిస్ తో భావోద్వేగాలకు మరింత లోతును జోడించారు. ముఖ్యంగా వెంకటేష్ ను కూతురు నవ్వమని అడిగినప్పుడు.. ఒకపక్క కంటి నుంచి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ నవ్వుతున్నట్లు నటిస్తున్న వెంకీమామను చూస్తే ఎవరికైనా కంటనీరు రాకమానదు. ఈ చిన్నారిని బాటించుకోవడం కోసం వెంకీ మామ ఏం చేసాడు అనేది సినిమా కథగా తెలుస్తోంది. జనవరి 13 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో వెంకీ మామ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.