Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saif Ali Khan Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన కత్తిపోటు దాడి కేసు కీలక మలుపు తిరుగుతోంది. నిందితుడైన బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం తాను చేసిన నేరాన్ని అంగీకరిస్తూ ముంబై సెషన్స్ కోర్టులో దరఖాస్తు దాఖలు చేయడంతో మళ్ళీ ఈ కేసు హాట్ టాపిక్ అవుతోంది. 2025 జనవరి 16న సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఓ వ్యక్తి ఆయన అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోని ఓ భాగం నుంచి లోపలికి ప్రవేశించిన దుండగుడు సైఫ్ కుమారుడి గదికి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ సభ్యులను రక్షించే ప్రయత్నంలో సైఫ్ అతడిని ఎదుర్కొన్న సమయంలో నిందితుడు కత్తితో దాడి చేసినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి తర్వాత సైఫ్‌ను వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. దాడి సమయంలో కత్తి విరిగిన భాగం ఆయన శరీరంలో ఉండిపోయిందని, దానిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆసుపత్రిలో కొన్ని రోజుల చికిత్స అనంతరం సైఫ్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించారు. ఈ కేసులో మహమ్మద్ షరీఫుల్ ఇస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను కస్టడీలో ఉన్నాడు.
Also Read
- Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
- Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
- Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
- Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
ఇప్పుడు నేరాన్ని అంగీకరిస్తున్నందున శిక్షా కాలంలో కొంత క్షమాభిక్ష ప్రసాదించాలని 2026 ఆగస్టు 28న జరిగిన కోర్టు విచారణలో న్యాయస్థానాన్ని కోరారు. ఈ నెల ప్రారంభంలోనే అదనపు సెషన్స్ జడ్జి నిందితుడిపై ఫారినర్స్ యాక్ట్ కింద ప్రాణాంతక ఆయుధంతో దోపిడీ, తీవ్ర గాయాలు చేయడం వంటి కఠినమైన సెక్షన్లను ఫ్రేమ్ చేశారు. దీని ప్రకారం అతనికి గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. నిందితుడి నేర అంగీకార పిటిషన్‌పై స్పందించాల్సిందిగా ప్రాసిక్యూషన్‌ను ఆదేశించిన కోర్టు, ఈ కేసు తదుపరి విచారణను 2026 సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. ఇప్పుడు నిందితుడే తన నేరాన్ని అంగీకరించేందుకు ముందుకు రావడంతో అతని అభ్యర్థనను కోర్టు ఎలా పరిగణిస్తుంది? ప్రాసిక్యూషన్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది? తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ 11న కోర్టులో జరిగే వాదనలపైనే ఉంది.
- Tags
- cinema
- Saif Ali Khan
తాజావార్తలు
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!