Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hrehaan Roshan: బాలీవుడ్లో రోషన్ కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన, దర్శకత్వం వంటి విభాగాల్లో ఈ కుటుంబానికి చెందిన పలువురు ఇప్పటికే తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో యువ ప్రతిభ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పెద్ద కుమారుడు హృహాన్ రోషన్ (20) సంగీత కళాకారుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని అభిమానులు భావిస్తున్న సమయంలో ఆయన మ్యూజిక్ ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు తన తొలి ప్రయత్నంలోనే గాయకుడిగా, రచయితగా, గిటారిస్ట్‌గా కూడా తన ప్రతిభను చూపించడం విశేషం.
హృహాన్ రోషన్ తన తొలి సింగిల్ ‘దిస్ హెవెన్లీ ప్లేస్’తో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ పాటకు గాయకుడిగా, పాటల రచయితగా, గిటారిస్ట్‌గా ఆయనే వ్యవహరించారు. దీంతో ఇది కేవలం ఓ పాటగా కాకుండా, తనలోని మల్టీటాలెంట్‌ను పరిచయం చేసే ప్రయత్నంగా నిలిచింది. ‘దిస్ హెవెన్లీ ప్లేస్’ మ్యూజిక్ వీడియో కూడా చాలా సింపుల్‌గా రూపొందించారు. భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా, సంగీతంపైనే పూర్తిగా దృష్టి పెట్టేలా వీడియోను రూపొందించారు. ఇందులో హృహాన్ స్వయంగా గిటార్ వాయిస్తూ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అతని ఆల్బమ్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.
Also Read
రోషన్ కుటుంబంలో సుదీర్ఘ విరామం తర్వాత ఒక కొత్త తరం సింగర్ రావడంతో తండ్రి హృతిక్ రోషన్, తల్లి సుసానే ఖాన్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హృహాన్ తొలి ప్రయత్నం పట్ల వారు ఎంతో గర్వంగా ఉన్నట్లు అభినందనలు తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి లభించిన ఈ ప్రోత్సాహం హృహాన్ కొత్త ప్రయాణానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. హృహాన్ చిన్న వయసు నుంచే సంగీతంపై ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గిటార్ వాయించడం, పాటలు రాయడం వంటి అంశాలపై ఆయన దృష్టి పెట్టారు. కేవలం స్టార్ హీరో కిడ్ లా కాకుండా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
స్టార్ కిడ్స్ విషయంలో ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. తల్లిదండ్రుల ఇమేజ్ కారణంగా వారికి గుర్తింపు లభించినప్పటికీ, తమ సొంత టాలెంట్ ను నిరూపించుకోవడం మాత్రం వారి ముందున్న అసలు సవాలు. హృహాన్ విషయంలోనూ ఇదే ఆసక్తి కనిపిస్తోంది. హృతిక్ రోషన్ కుమారుడిగా పరిచయం కావడం ఆయనకు ఒక గుర్తింపును ఇచ్చినప్పటికీ, సంగీత కళాకారుడిగా తన స్థానం సంపాదించుకోవాలంటే వరుసగా మంచి పాటలను అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘దిస్ హెవెన్లీ ప్లేస్’తో ప్రారంభమైన హృహాన్ సంగీత ప్రయాణం ఎటువైపు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయన భవిష్యత్తులో మరిన్ని పాప్ ఆల్బమ్స్ చేస్తారా, సినిమా సంగీతంలోకి అడుగుపెడతారా, లేక గాయకుడిగా, పాటల రచయితగా తనకంటూ ప్రత్యేకమైన కెరీర్‌ను నిర్మించుకుంటారా అనేది చూడాలి.
- Tags
- cinema
- Hrehaan Roshan
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!