తన ఫిల్మోగ్రఫీలో ‘విరాటపర్వం’ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందని సాయి పల్లవి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. ఎందుకంటే.. ఒక రియల్ లైఫ్ రోల్‌లో తాను నటించడం ఇదే తొలిసారి అని, ఇలాంటి పాత్ర చేయడం వల్ల తాను గొప్ప ఫీలింగ్‌ని అనుభూతి చెందానని, సినిమా చూస్తున్నప్పుడు మీరూ (అభిమానుల్ని ఉద్దేశిస్తూ) అలాంటి ఫీలింగే పొందుతారని తెలిపింది. ఇంత గొప్ప పాత్రలో తనని ఊహించినందుకు, నటించే ఆఫర్ ఇచ్చినందుకు దర్శకుడు వేణు ఊడుగులకి ధన్యవాదాలు చెప్పింది. టెక్నీషియన్స్ అందరూ గొప్ప పనితనం చాటారని, థియేటర్లలో సినిమా చూసినప్పుడు వారి పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేరని పేర్కొంది.
తనతో కలిసి నటించిన తోటి నటీనటుల పాత్రలు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయని, ఏదో అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్టుగా ఉండవని, ప్రతీ పాత్ర ప్రభావితం చేసేలా వాళ్లంతా మంచి నటనా కౌశలం చాటారని సాయి పల్లవి కొనియాడింది. ఇక రానా గురించి మాట్లాడుతూ.. ఆయన ఆహార్యం ఎంత పెద్దదో, మనసు కూడా అంతే పెద్దదని ప్రశంసించింది. ఎలాంటి భేషజాలు లేకుండా అందరినీ ఆయన ప్రోత్సాహించే విధానం నిజంగా ప్రశంసనీయమని తెలిపింది. సినీ పరిశ్రమని వృద్ధి చేయాలన్న ఆలోచనకు, అందరినీ ఎంకరేజ్ చేయాలన్నా విషయానికి.. రానా ఒక టార్చ్ బేరర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించేసింది. ఆయనతో కలిసి పని చేయడం చాలా గర్వంగా ఉందని చెప్పింది.
ఇక చివరగా.. తనని ఇంతలా ఆదరిస్తున్నందుకు ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్పింది సాయి పల్లవి. కొత్త కొత్త ప్రయోగాల్ని తెలుగు ప్రేక్షకులు స్వాగతిస్తారని, ఈ సినిమాని కూడా తప్పకుండా ఆదరిస్తారని తాను నమ్ముతున్నానని, కచ్ఛితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది. అంతకుముందు తన ప్రసంగం ప్రారంభించినప్పుడు.. ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేశ్‌కు ధన్యవాదాలు చెప్పింది.