Sai Pallavi: మరో పవర్‌ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!

Saipallavi

Saipallavi

Sai Pallavi: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ కిషోర్ తిరుమల తన నెక్ట్స్ సినిమా కోసం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి ఆయన కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. తన గత చిత్రాలకు భిన్నంగా కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో హీరోయిన్ న్యాచురల్ పెర్ఫార్మర్ సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉన్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. కథకు బలమైన ప్రాధాన్యం ఉండటంతో పాటు, పాత్రకు నటనకు ఎక్కువ అవకాశాలు ఉండేలా కిషోర్ తిరుమల ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల ఈ కథను సాయి పల్లవికి వినిపించగా, ఆమె నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయని, నటీనటులు, సాంకేతిక బృందం ఎంపిక పూర్తయిన తర్వాత చిత్రాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెబితే మరో పవర్‌ఫుల్ రోల్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కిషోర్ తిరుమల -సాయి పల్లవి కాంబినేషన్ నిజమైతే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొనే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామాయణ చిత్రంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.