Sai Pallavi Isn’t A ‘Lady Power Star’!?
సాయి పల్లవి పేరు వినగానే తను నటించిన పలు సినిమాలు వాటిలో తన నటన గుర్తుకు రాక మానదు. ఇటీవల కాలంలో తనను లేడీ పవర్ స్టార్ అనటం మొదలు పెట్టారు. హీరోయిన్లలో తను నిజంగానే సెపరేట్. ఎక్స్ పోజింగ్ కి వ్యతిరేకంగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ కూడా మేల్ డామినేడెట్ ఇండస్ట్రీలో తను చక్కటి ఇమేజ్ తో పాటు స్టార్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో ఇది చాలా అరుదైన విషయం.
ఆరంభంలో చిన్న పాత్రల్లో కనిపించినా ‘ప్రేమమ్’తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది సాయిపల్లవి. ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’, ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంది. తమిళ సినిమా ‘దియా, పడి పడి లేచె మనసు’తో ప్రాధాన్యమున్న పాత్రలు చేసినా ‘మారి2’లో రౌడీబేబి పాటలో తిరుగులేని స్టార్ గా ఎదిగింది. ఆ తర్వాత అథిరన్, ఎన్ జికె సినిమాలతో కొద్దిగా వెనకబడ్డా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’తో మళ్ళీ గ్రాఫ్ పెంచుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన ‘శ్యామ్ సింగ్ రాయ్, విరాట పర్వం, గార్గి’ సినిమాలు ఒక్కసారిగా అమ్మడి కెరీర్ ను డౌన్ చేసేశాయి.
‘విరాట పర్వం, గార్గి’లో సాయి పల్లవి నటనకు ప్రశంసలు లభించినప్పటికీ గతంలోలా తన కోసం ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించలేక పోయింది. దీంతో సాయిపల్లవి కి థియేటర్లకు క్రౌడ్ ను రప్పించే సామర్థ్యం లేదనే వాదన మొదలైంది. అంతే కాదు హీరో ఇమేజ్ తో పాటు తన నటన, డాన్స్ ఉన్నపుడే సినిమాలకు ప్రేక్షకాదరణ లభిస్తుందని, ఊరికే లేడీ పపర్ స్టార్ అన్నంత మాత్రాన పని జరగదనే కామెంట్స్ వచ్చాయి. ఇటీవల విడుదలైన సాయిపల్లవి రెండు సినిమాలకు సంబంధించి ‘విరాటపర్వం’కు అతి వుష్టిలా ఓవర్ ప్రమోషన్, ‘గార్గి’కి అనావుష్టిలా ప్రమోషన్ లేకపోవడం వల్ల నష్టం జరిగిందని అంటున్నారు. ఏది ఏమైనా సాయిపల్లవి తన పాత్రల ఎంపికలో జాగ్రత్త వహించనట్లే స్టార్ కాస్ట్ వ్యవహారంలోనూ ముందుచూపుతో వ్యవహరించాలని, హీరోలెందుకు నేనుండగా అనుకుంటే తప్పులో కాలేక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో సినిమాలు ఏవీ లేవు. తాజాగా వచ్చిన తన సినిమాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్లే ముందుకు వెళ్ళి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశిద్దాం.