Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..

Sai Pallavi Ek Din Movie

Sai Pallavi Ek Din Movie

నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో అలరించే సాయి పల్లవి, ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన నటించిన చిత్రం ‘ఏక్ దిన్’. ఈ సినిమా మే 1, 2026న విడుదలైంది. అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. మొదటి రోజే మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పడానికి ప్రధాన కారణం ఆమిర్ ఖాన్‌తో ఉన్న అనుబంధమే అని తెలిపింది.. ‘ఆ సమయంలో నేను చాలా సీరియస్, ఎమోషనల్ సినిమాలు చేస్తున్నాను. కొంచెం మనసుకు హాయిగా ఉండే (Light-hearted) కథ చేయాలనుకున్నా. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘బిఫోర్ సన్‌రైజ్’ (Before Sunrise) గుర్తొచ్చింది. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఒప్పుకున్నా. కానీ ఈ పాత్రకు నేను సరిపోలేదేమో (Miscast), నా కంటే ఇంకెవరినైనా తీసుకుంటే బాగుండేదని ఆమిర్ సార్‌తో కూడా చెప్పాను’ అని తన మనసులోని మాటను బయటపెట్టింది. హిందీలో తొలి సినిమానే అయినప్పటికీ, సాయి పల్లవి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె రణబీర్ కపూర్ సరసన ‘రామాయణ’లో సీతగా నటిస్తూ బిజీగా ఉంది.