Site icon NTV Telugu

Sai Pallavi : హిట్ ఇచ్చిన హీరోతో సాయిపల్లవి మరో సినిమా..?

Saipallavi

Saipallavi

Sai Pallavi : సాయిపల్లవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం రామాయణ మూవీలో నటిస్తోంది. అది భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో సీత పాత్రలో కనిపించబోతోంది సాయిపల్లవి. అయితే ఈ బ్యూటీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. తెలుగులో తండేల్ తర్వాత మళ్లీ ఈ బ్యూటీ కనిపించలేదు. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్, హీరోతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. అతను ఎవరో కాదు హీరో ధనుష్. వీరిద్దరూ కలిసి మారి 2 సినిమాలో నటించారు. అది మంచి హిట్ అయింది.

Read Also : Rajamouli : దేవుడిపై రాజమౌళి కామెంట్స్.. పాత వీడియోలతో పెరిగిన రచ్చ

ఈ ఏడాది వచ్చిన అమరన్ తో సాయిపల్లవికి మంచి హిట్ దక్కింది. ఈ మూవీ డైరెక్టర్ తో ధనుష్‌ హీరోగా ఓ సినిమా వస్తోంది. అందులో హీరోయిన్ గా కీర్తి సురేష్‌, పూజాహెగ్డే పేర్లు వినిపించాయి. కానీ చివరకు సాయిపల్లవినే తీసుకుంటున్నట్టు తేలిపోయింది. ఇప్పటికే ఆమెకు స్క్రిప్టు చెప్పగా ఓకే చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై సాయిపల్లవి నుంచి లేదా మూవీ టీమ్ నుంచి అధికారికంగా కన్ఫర్మేషన్ రాబోతున్నట్టు సమాచారం. అదే జరిగితే మూవీపై మంచి హైప్ క్రియేట్ అవుతుందని అంటున్నారు నెటిజన్లు.

Read Also : Rajamouli : రాజమౌళి సినిమాలో మరో రాముడెవరు?

Exit mobile version