Sai Pallavi: ఆ విషయంలో అక్కనే మించిపోయావ్ గా పూజా.. నెక్స్ట్ లెవెల్ అంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. డ్యాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా మారి.. తన డ్యాన్స్ తో, అందంతో.. ముఖ్యంగా వ్యక్తిత్వంతో అందరి మనసులను ఆకట్టుకుంది. ఆమె సెలెక్ట్ చేసుకొనే సినిమాలో పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప డబ్బుకోసం ఏరోజు ఆమె సినిమాలు చేసింది లేదు.. డబ్బు కోసం గ్లామర్ ఒలకబోయడం లేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ నిశ్చితార్థం రెండు రోజుల క్రితమే ఘనంగా జరిగింది. పూజా ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇక చెల్లి నిశ్చితార్థంలో అక్క హడావిడి ఎక్కువ కనిపించింది అంటే అతిశయోక్తి కాదు. అందంలో కానీ, డ్యాన్స్ లో కానీ అక్కకు ఏమాత్రం తీసిపోదు పూజా. ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడిన ఆనందం పూజా ఫేస్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఇక ఎంగేజ్ మెంట్ అయ్యాకా.. పూజా తీరిగ్గా అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తుంది. తాజాగా నిశ్చితార్థంలో కుటుంబం మొత్తం డ్యాన్స్ వేస్తున్న వీడియోను షేర్ చేసింది. సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక ఆ విషయంలో అక్కనే మించిపోయింది పూజా.. కాబోయే భర్తతో కలిసి స్టెప్స్ వేసింది.. ఎల్లో కలర్ చీర.. జుట్టు ముడివేసి.. సాయి పల్లవి ఎంత ముద్దుగా అయితే కనిపించిందో.. అంతకన్నా ముద్దుగా పూజా కనిపించింది. ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడిన సంతోషంతో తీన్మార్ స్టెప్స్ తో అదరగొట్టింది. జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలోని మా మదురే సాంగ్ కు పూజా స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు