Sai Durga Tej : సాయిదుర్గా తేజ్ హీరోగా వస్తున్న మూవీ సంబరాల ఏటిగట్టు. బ్రో సినిమా ప్లాప్ కావడంతో ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రోహిత్ కేపీకి ఛాన్స్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా పైగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. నేడు సాయితేజ్ బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో సాయితేజ్ బాడీ లాంగ్వేజ్, గెటప్, డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్ కూడా బాగున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో సాయితేజ్ మాట్లాడాడు. బ్రో సినిమా తర్వాత రెండు సినిమాలు ఆగిపోయాయి. అవి కన్ఫర్మ్ అయ్యాక ఆగిపోవడం చాలా బాధేసింది అంటూ తెలిపాడు సాయిదుర్గాతేజ్.
Read Also : Ahana Krishna : లగ్జరీ కారు కొన్న హీరోయిన్.. ఎన్ని కోట్లంటే..?
వాటి తర్వాత తనకు సంబరాల ఏటిగట్టు సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో వెంటకే ఓకే చెప్పినట్టు తెలిపాడు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని.. ఇలాంటి కథలో నటించాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టు వివరించాడు. రోహిత్ తాను ఊహించిన దాని కన్నా సినిమాను అద్భుతంగా తీస్తున్నాడని.. అందుకే ఈ సినిమా విషయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉన్నామన్నాడు సాయిదుర్గాతేజ్. అయితే మెగా మేనల్లుడు నటించే సినిమాలు ఆగిపోవడం ఏంటి అని అంతా షాక్ అవుతున్నారు. ఒక సినిమా ప్లాప్ అయితే అతని సినిమాలను ఆపేసేంత ధైర్యం ఎవరు చేస్తారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక సంబరాల ఏటిగట్టు సినిమాను హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి కలిసి రూ.120 కోట్లతో నిర్మిస్తున్నారు. సాయి తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తుంది ఈ మూవీ.
Read Also : Priyadarshi : నన్నెందుకు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారో అర్ధం కాలేదు!
