Sai Dharam Tej: క్రేజీ మల్టీ స్టారర్ రిజెక్ట్ చేసిన తేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆయన ఓ భారీ మల్టీస్టారర్ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. నిజానికి టాలీవుడ్‌లో ఓ అగ్ర హీరో నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం యంగ్ హీరో అవసరమయ్యారు. ఆ పాత్రకు సాయి ధరమ్ తేజ్ అయితే పర్ఫెక్ట్ అని భావించిన చిత్ర యూనిట్, ఆయన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ బిగ్ హీరోతో తేజ్ స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలని ఫ్యాన్స్ కూడా ఆశపడ్డారు. కాంబినేషన్ వినడానికి చాలా టెంప్టింగ్‌గా ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల తేజ్ ఈ ప్రాజెక్టుకు ‘నో’ చెప్పాల్సి వచ్చిందట.
Also Read : Aaya Sher: తొమ్మిది దేశాల్లో ‘ఆయా షేర్’ హవా
Also Read
తేజ్ ఈ సినిమాను రిజెక్ట్ చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తేజ్ ఒప్పుకున్న ప్రాజెక్టుల వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టంగా మారింది. తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ అనే పీరియడ్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఒక ప్రత్యేకమైన గెటప్‌ను మెయింటైన్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు మరో సినిమా ఒప్పుకుంటే, ఆ గెటప్ మార్చాల్సి ఉంటుంది. అది ప్రస్తుత సినిమా షూటింగ్‌పై ప్రభావం చూపుతుందని ఆయన భావిస్తున్నారు. ఒకే సినిమాపై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ క్రేజీ మల్టీస్టారర్ ఆఫర్‌ను ఆయన వదులుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరి ‘సంబరాల ఏటి గట్టు’తో తేజ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!