Read Also: Chiru: పది రోజుల్లో తెలుగు రాష్ట్రాలని తాకనున్న మెగా తుఫాన్
జులై 28న ఆడియన్స్ ముందుకి వచ్చిన బ్రో సినిమా సూపర్బ్ టాక్ తో, సాలిడ్ బుకింగ్స్ తో మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సస్ టూర్ లో ఉన్నారు. ఇందులో భాగంగా సాయి ధరమ్ తేజ్, సముద్రఖని విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్లారు. ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం దుర్గమ్మని దర్శించుకున్న సాయిధరమ్ తేజ్, సముద్రఖని ప్రత్యేక పూజలు చేసారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. వీరికి అమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందించారు.
Read Also: Rajini: ఇక్కడ సౌండ్ లేదు కానీ అక్కడ రికార్డులు చెల్లాచెదురు అవ్వడం పక్కా
