Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saha: యువ కథానాయకుడు శివ కుమార్ కాసారం నటిస్తున్న తెలుగు మూవీ ‘సహ’ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్ ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన గ్లింప్స్ ఎమోషనల్ టచ్‌తో ఆకట్టుకోగా.. ఇప్పటివరకు విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు చిత్రబృందం తాజాగా సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ‘సహా’ 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్రబృందం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, పాటలు సినిమాకు సంబంధించిన కథ ఆసక్తిని కలిగిస్తున్నాయి.
సంజు జీవితంలోకి సహా రాకతో..
‘సహ’ (Sahaa: Life of Sanju) అనేది నిశాంత్ దోటి దర్శకత్వంలో సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల నిర్మిస్తున్న ఒక ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా తెలుగు చిత్రం. శివ కుమార్ కాసారం కథానాయకుడిగా, శ్వేతా లక్ష్మణ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా సంజు (శివ కుమార్ కాసారం) అనే యువకుడి జీవితంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగే ప్రేమ, జ్ఞాపకాల చుట్టూ తిరుగుతుంది. తన గత జీవితంలోని బాధల నుండి కోలుకునే క్రమంలో అతని జీవితంలోకి ‘సహా’ అనే అమ్మాయి ప్రవేశించిన తర్వాత జరిగిన మార్పులను ఈ కథలో ఆవిష్కరించారు. శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Also Read
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి'
గ్లింప్స్‌తో పెరిగిన అంచనాలు
ఇటీవల విడుదలైన ‘సహ’ గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. అందమైన విజువల్స్, పాత్రల మధ్య కనిపించే కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు ఇప్పటివరకు విడుదలైన పాటలు కూడా సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చాయి. దీంతో సినిమా మ్యూజికల్ ఆల్బమ్‌పై కూడా ఆసక్తి పెరిగింది. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న ‘సహ’ను ప్రేక్షకులకు ఒక అందమైన, భావోద్వేగభరితమైన సినిమా అనుభూతిని అందించేలా తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రచార కంటెంట్‌కు వచ్చిన స్పందనతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి సంజు, సహాల ప్రేమకథ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
-
Zeptoలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?