Site icon NTV Telugu

Shakuntalam: ఆరు గంటలకి శాకుంతలం నుంచి ‘ఋషివనములోనా’…

Shakuntalam

Shakuntalam

లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచి ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అవనున్న శాకుంతలం మూవీ ట్రైలర్ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సమంతా స్క్రీన్ ప్రెజెన్స్, గుణశేఖర్ టేకింగ్ శాకుంతలం ట్రైలర్ ని వర్త్ వాచింగ్ గా మార్చాయి. ఇప్పటికే శాకుంతలం మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యి అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది, తాజాగా శాకుంతలం సినిమా నుంచి “ఋషివనములోనా” అంటూ సాగే రెండో సాంగ్ ని ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Read Also: Venky 75: ‘విక్రమ్’ రేంజులో ‘సైంధవ్’… వెంకీ మామ నెవర్ బిఫోర్

కాళిదాస్ రాసిన కథ ప్రకారం చూస్తే ఋషివనములోనే శకుంతల, దుష్యంతుడు పరిచయం అవుతారు. ఇక్కడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి, గాంధర్వ వివాహానికి దారి తీస్తుంది. శకుంతల, దుష్యంతల ప్రేమని చూపించేలా ఈ సెకండ్ సాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సెకండ్ సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్నారు. దిల్ రాజు ప్రెజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడం గ్యారెంటి. ఆ తర్వాత టాక్ బాగుంటే లాంగ్ రన్ ఉంటుంది లేదంటే శాకుంతలం సినిమా కోసం చిత్ర యూనిట్ పడిన కష్టంలో అర్ధం లేకుండా పోతుంది.

Read Also: Kalyan Ram: ‘అమిగోస్’లో బాబాయ్ పాటని రీమిక్స్ చేసాం… టైటిల్ క్లాస్, సినిమా మాస్

Exit mobile version