Site icon NTV Telugu

Sitha Ramam: ‘సీతారామం’ రన్ టైమ్ ఎంతంటే….

Sitaramam

Sitaramam

Do You know the run time of ‘Sitaram’ Movie is?

దుల్కర్ సల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘సీతారామం’. రశ్మికా మందణ్ణ, తరుణ్‌ భాస్కర్‌, సుమంత్, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను హను రాఘవపూడి దర్శకత్వంలో సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. హిందీ తప్ప దక్షిణ భారత భాషలన్నింటిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. హీరో దుల్కర్ సల్మాన్ మలయాళీ కావడం, రశ్మిక కన్నడిగ కావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఇక హిందీతో పాటు పలు ఇతర భాషా నటీనటులూ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

వారం క్రితం ఈ సినిమా తెలుగు వర్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ అందుకుంది. మూవీ ఈ నెల 5న విడుదల కాబోతున్న నేపథ్యంలో అదర్ లాంగ్వేజ్ వర్షన్స్ సెన్సార్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. లెఫ్టినెంట్ రామ్, సీత మధ్యలో సాగే ఈ ప్రేమాయణం ఆసక్తికరంగా ఉందని, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని అంటున్నారు. ఈ మూవీ రన్ టైమ్ ను నిర్మాతలు గం. 2.43 నిమిషాలకు లాక్ చేశారు. సెన్సార్ లోనూ ఎలాంటి కట్స్ ఇవ్వకపోవడంతో అదే రన్ టైమ్ ఫిక్స్ అయిపోయింది. గత వారం వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ రన్ టైమ్ కేవలం గం. 2. 27 నిమిషాలే. అయితే దానికి ముందు వచ్చిన కమల్ హాసన్ సినిమా ‘విక్రమ్’ డ్యూరేషన్ గం. 2. 54 నిమిషాలు. ఆ సినిమా చూస్తున్నంత సేపు సమయమే తెలియలేదని ఆడియెన్స్ భావించారు. సో… థియేటర్ లో కూర్చేపెట్టేలా కథ సాగాలే కానీ మూవీ రన్ టైమ్ పెద్దంత విషయం కాదని ‘విక్రమ్’ సినిమా విజయం నిరూపించింది. మరి ‘సీతారామం’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version