కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ క్రియేట్ చేస్తున్న నటి. 2019లో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె, తొలినాళ్లలో అవకాశాల కోసం ఆందోళన చెందింది. ఒక దశలో “ఇంకో సినిమా దొరుకుతుందా? లేక వేరే ఉద్యోగం వెతకాల్సి వస్తుందా?” అనే పరిస్థితి వచ్చిందని ఆమె స్వయంగా అంగీకరించింది. అయితే, అదే సమయంలో వచ్చిన ‘సప్తసాగరాలు దాటి’ ఆమె కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయ్యింది.
Also Read: Kaliki : తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ హింట్.. ‘కల్కి 2’లో కనిపించనున్నాడా?
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి మాట్లాడుతూ.. “సప్తసాగరాలు దాటి’ సినిమా గురించి మాట్లాడకుండా, మరో ప్రాజెక్టు గురించి వివరాలు పంచుకునే స్థాయికి నేను ఇంకా చేరుకోలేదు. ఆ స్థాయికి ఎప్పటికీ చేరుకోలేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా నాకు చిత్రసీమలో మరో జీవితం ఇచ్చింది. నా కెరీర్‌లో ఇది మైలురాయిగా నిలిచిపోయింది” అని చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. ఇక రుక్మిణి తన సహజమైన నటన, భావోద్వేగాలను వ్యక్తపరిచే శైలి వల్ల అభిమానులను బాగా ఆకట్టుకుంది. దీంతో అగ్రతారల సరసన కూడా ఇప్పుడు ఆమెకి అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె శివకార్తికేయన్ సరసన నటిస్తున్న ‘మదరాసి’ చిత్రం రాబోతుంది. ఈ మూవీతో ఆమె తమిళ ప్రేక్షకులకు దగ్గర కావాలని ఆశిస్తోంది. మొత్తానికి, “సప్తసాగరాలు దాటి” సినిమా రుక్మిణి వసంత్ కెరీర్‌లో ఒక మరుపురాని మలుపు. అదే కారణంగా ఆమె ఎంత పెద్ద సినిమాలు చేసినా, ఆ చిత్రాన్ని మించి మరేదీ తనకు ప్రాధాన్యత కలిగించదనే స్పష్టతతో ముందుకు సాగుతోంది.
