Site icon NTV Telugu

Rukmini Vasanth: ఆ నటుడితో ప్రేమలో రుక్మిణి వసంత్.. ఫొటో లీక్?

Rukmini Vasanth Lover Photo Leaked

Rukmini Vasanth Lover Photo Leaked

‘సప్త సాగరాలు దాటి’ అంటూ కన్నడ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయింది రుక్మిణి వసంత్. ఆ తర్వాత తెలుగులో నిఖిల్ సరసన ఓ సినిమా చేసింది కానీ అది ఏ మాత్రం వర్కవుట్ అవ్వలేదు. ఈ మధ్యనే ఆమె ‘కాంతార: ది లెజెండ్’ సినిమాలో కీలక పాత్రలో నటించి తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమె ప్రేమలో పడిందని, ఆమె ప్రియుడి ఫోటో లీక్ అయింది అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ వాస్తవానికి అది ఇప్పటి ఫోటో కాదు, 2023లో స్వయంగా ఆ ఫోటోని రుక్మిణి వసంత్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఆ ఫోటోలో ఉన్నది ఆమె ప్రియుడు కాదు, ఆమె స్నేహితుడు సిద్ధాంత్ నాగ్. అతను కూడా నటుడే.

Also Read :Rohan : బంపర్ ఆఫర్ కొట్టేసిన బుడ్డోడు.. ఏకంగా చిరంజీవితో!

రుక్మిణి వసంత్‌తో పాటు నటనలో ప్రయత్నాలు చేస్తూ అప్పట్లో ఇద్దరూ క్లోజ్‌గా ఉండేవారు. అయితే రుక్మిణికి వరుస అవకాశాలు రావడంతో ఆమె బిజీ అయ్యారు. సిద్ధాంత్ నాగ్ మాత్రం నటుడిగా ఇంకా బ్రేక్ అందుకోలేకపోయాడు. ఎవరు తీశారో, ఎందుకు తీశారో తెలియదు కానీ ఆ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాబట్టి రుక్మిణి వసంత్ కమిటెడ్ అని, రుక్మిణి వసంత్ ప్రేమలో పడింది అంటూ వస్తున్న వార్తలు అయితే ప్రస్తుతానికి నిజం కాదు. ప్రస్తుతానికి ఆమె ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version