Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: ‘రుద్రవనం’లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“క్రైమ్‌ను ఫాలో అయితే జరిగింది మాత్రమే తెలుస్తుంది.. కానీ క్రిమినల్ని ఫాలో అయితే జరగబోయేది కూడా తెలుస్తుంది..” ఈ ఒక్క పవర్ఫుల్ డైలాగ్ చాలు, రాబోయే క్రైమ్ థ్రిల్లర్ ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో చెప్పడానికి. ఒక ఊరు.. ఆ ఊరిలో అనూహ్యంగా దొరికిన ఓ తల లేని మృతదేహం.. ఆ వెంటనే మరో వ్యక్తి అదృశ్యం! వినడానికే వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ వరుస సంఘటనల వెనుక ఉన్న ఆ చీకటి కోణం ఏంటి? ఈ రక్తపాత మిస్టరీని ఛేదించడానికి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగితే ఏం జరిగింది? ఇలాంటి ఉత్కంఠభరితమైన ప్రశ్నలతో ప్రేక్షకుల్లో ఒక రేంజ్ సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తోంది జీ5 ఒరిజినల్ సరికొత్త మినీ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’.
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ నరేష్ అగస్త్య.. ఈ సిరీస్‌లో ఎస్ఐ శివ కుమార్‌గా అగ్రెసివ్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కేవలం ఓ మర్డర్ మిస్టరీలా మొదలయ్యే ఈ కేసు దర్యాప్తు, లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ ఊరిలోని పాలిటిక్స్, ఎవరికీ తెలియని అవినీతి చీకట్లు, ఎన్నో ఏళ్లుగా మరుగున పడిపోయిన భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. ఒకానొక దశలో ఈ కేసు విచారణ.. హీరోకి ఒక వ్యక్తిగత పోరాటంగా మారిపోతుంది. పైకి ఎంతో ప్రశాంతంగా కనిపించే ‘రుద్రవనం’ గ్రామం తన గుండెల్లో దాచుకున్న ఆ అసలు రహస్యం ఏంటనేది ఇప్పుడు అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read
- Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
విజయదశమి కానుకగా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే.. ఇది పక్కా సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. శ్రీచక్ర మూవీస్ బ్యానర్‌పై శశిధర్ మున్నంగి అత్యంత భారీ విజువల్స్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. తాజ్ సయ్యద్ అందించిన పదునైన రాతలు (రచన), అష్కర్ అలీ సినిమాటోగ్రఫీ ఈ సిరీస్‌కు మెయిన్ పిల్లర్స్‌గా నిలవనున్నాయి. నరేష్ అగస్త్యతో పాటు బెనర్జీ, శివ ఆలపాటి, సుగాలి సులోని, రమేష్ కోనంబొట్ల, శివాని రెడ్డి లాంటి సీనియర్ అండ్ యంగ్ క్యాస్టింగ్ ఈ సిరీస్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. ‘రుద్రవనం పీఎస్’ అక్టోబర్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఎస్ఐ శివ కుమార్ ఆ తల లేని మృతదేహం మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడో తెలుసుకోవాలంటే ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందే!
తాజావార్తలు
-
Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: ‘రుద్రవనం’లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
-
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
-
Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
Gujarat Man Suicide: భార్య, అత్తింటి వేధింపులు.. కొండపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
ట్రెండింగ్
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!