Rudrangi Trailer: జగ్గు భాయ్.. విలనిజంతోనే భయపెట్టి చంపేసేలా ఉన్నాడు

Rudrangi

Rudrangi

Rudrangi Trailer:విలక్షణ నటుడు జగపతిబాబు రీ ఎంట్రీలో సైతం అదరగొడుతున్నాడు. విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. ఇప్పటికే స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తున్న ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు సరసన విమలా రామన్, మమతా మోహన్ దాస్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒకప్పటి జమీందార్ లు ప్రజలను ఎలా హింసించేవారో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇందులో జగపతి బాబు భీంరావ్ దొర గా కనిపిస్తున్నాడు.

Bhaag Saale: కీరవాణి కొడుకు సినిమాలో ఎన్టీఆర్, చరణ్… థియేటర్స్ లో నవ్వులే

×
×
Ad

రుద్రంగి అనే ఊరిలో అతడిని ఎదిరించి బతకడం అసాధ్యం. అతడు చెప్పిందే శాసనం.. అతడు గీసిందే గీత. దాన్ని దాటి బయటికి వస్తే మరణమే. ఇక అలాంటి క్రూర జమీందార్ ను ఎదురించి ఆ గ్రామ ప్రజలు ఎలా నిలబడ్డారు అనేది కథాగా తెలుస్తోంది. ఈ సినిమా అంతా తెలంగాణ 1950 ల కాలంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇక జగపతిబాబు నటన అయితే సినిమాకు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. రసమయి ఫిల్మ్స్ బ్యానర్ లో తెలంగాణ ప్రముఖ గేయ రచయిత రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో జగపతిబాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.