Rudrangi Trailer:విలక్షణ నటుడు జగపతిబాబు రీ ఎంట్రీలో సైతం అదరగొడుతున్నాడు. విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. ఇప్పటికే స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తున్న ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు సరసన విమలా రామన్, మమతా మోహన్ దాస్ నటిస్తున్నారు.