ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తున్నారు. ఛానెల్ ఏదైనా, ఇంటర్వ్యూ మాత్రం వీరిదే.. స్పెషల్ ఇంటర్వ్యూస్ తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నారు. వీరికి యాంకర్స్ అవసరం లేదు.. ప్రత్యేకంగా ప్రమోట్ చేయడానికి న్యూస్ ఛానెల్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.. ముగ్గురు.. ముగ్గురే.. అందుకే అంటారు ప్రమోషన్ల యందు జక్కన్న ప్రమోషన్స్ వేరయా అని.. గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో వీరి ముగ్గురు హంగామా మాములుగా లేదు. ఇక తాజాగా ఈ ప్రమోషనలలో భాగంగా కొత్త ఇంటర్వ్యూ ని స్ట్రీమింగ్ చేశారు మేకర్స్. అందులో ఎన్టీఆర్ వాక్చాతుర్యానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రభాస్ పై కామెడీ చేశాడు.
ఈ ఇంటర్వ్యూ లో ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ తారక్ ప్రీమియర్స్ కోసం రాజమౌళిని తారక్ ప్రభాస్ ని పిలుద్దామా అని అడగగా.. రాజమౌళి.. ఏంటి ప్రభాస్ నే.. ఆయన ఒక ప్రీమియర్ కోసం కదిలి రావడం జరిగే పని కాదులే అని చెప్పగా .. నువ్ కాకపోతే చరణ్ పిలుస్తాడు, లేకపోతే మేమిద్దరం పిలుస్తాం అని తారక్ అంటాడు. ఇవన్నీ కాదు.. అది జరిగే పని కాదు.. ప్రభాస్ రాడు .. వదిలేయ్ అని జక్కన్న ఫన్నీగా చెప్పడం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అన్నా.. ప్రభాస్ అన్నను కూడా పిలవండి ఇంటర్వూస్ కి అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
