Site icon NTV Telugu

RRR Movie: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా..

RRR

RRR

బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి సిద్దమవుతుంది. వరుస వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డులు సృష్టించాయి. ఇక తాజగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎత్తర జెండా అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను తాజగా రిలీజ్ చేశారు చిత్రబృందం. చరణ్, తారక్ ఇద్దరు జెండాలతో నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా అంటూ పాడుతుండగా మధ్యలో అలియా కూడా వారితో చిందులు వేస్తూ కనిపించింది. ఈ ఫుల్ సాంగ్ మార్చ్ 14 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=O7yqSvUXagw
Exit mobile version