Karan Johar: ఇతని ప్రేమ కథల్లో మ్యాజిక్ ఉంటుంది బ్రదరు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరణ్ జోహార్ అనే పేరు వినగానే బాలీవుడ్ లో యంగ్ రియల్ టాలెంట్ ని తొక్కేసి, నేపోటిజంకి సపోర్ట్ చేసే ఒక స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గుర్తొస్తాడు. హిందీ ఫిలిం ఇండస్ట్రీలో ఏ స్టార్ ఫ్యామిలీలో కిడ్స్ ఉన్నా వారిని ఇండస్ట్రీలోకి లాంచ్ చేసి వారి కెరీర్స్ ని సెటిల్ చేసే వరకు సినిమాలు చేస్తూనే ఉండడం కరణ్ స్టైల్. అందుకే అతనిపై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, నెగిటివిటీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మొత్తం బాలీవుడ్ లో అత్యధిక వివాదాలని తన చుట్టూ వేసుకోని తిరిగే కరణ్ జోహార్ లో ఒక సూపర్బ్ డైరెక్టర్ ఉన్నాడు. వివాదాలు, విమర్శలని పక్కన పెట్టి చూస్తే కరణ్ లోని డైరెక్టర్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కరణ్ మెగా ఫోన్ పడితే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తెరపై చూడొచ్చు.
కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ ఘమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ లాంటి సినిమాలు కరణ్ నుంచి వచ్చి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలిచినవే. ఈ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ఫీలింగ్స్ ని కరణ్ సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు. ఎమోషన్స్ ని హార్ట్ టచింగ్ గా చూపించడంలో కరణ్ దిట్ట. అయితే 2016లో వచ్చిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దీని తర్వాత కరణ్ వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేసాడు, ప్రొడక్షన్ కి మాత్రమే పరిమితం అయ్యాడు కానీ డైరెక్షన్ మాత్రం చెయ్యలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పడుతూ కరణ్ ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. రణవీర్ సింగ్, ఆలియా భట్ లు ‘గల్లీ బాయ్’ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కరణ్ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా చేస్తున్నాడు.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
కరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ధర్మ ప్రొడక్షన్స్ నుంచి ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ బయటకి వచ్చాయి. వీటిలో రణ్వీర్ అండ్ అలియా భట్ లు చాలా ట్రెండీ అండ్ మోడరన్ లుక్ లో కనిపించారు. ఈ మూవీలో ‘రాకీ’గా రణవీర్, ‘రాణీ’గా ఆలియా నటిస్తుండగా… వారి గ్రాండ్ పేరెంట్స్ గా ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయ బచ్చన్ కనిపించబోతున్నారు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా జూలై 28న ఆడియన్స్ ముందుకి రానుంది. మంచి ఫీల్ ఉన్న సినిమాలని డైరెక్ట్ చేసిన కరణ్ జోహార్, మరోసారి ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చూపించి ఎలాంటి బాక్సాఫీస్ రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
Yaaron ka yaar, rocking in every avatar, aur iss ‘prem kahaani' ka dildaar – meet Rocky!🤟🏻
#RockyAurRaniKiiPremKahaani, a film by Karan Johar in his 25th anniversary year.
In cinemas 28th July, 2023.#RRKPK @aapkadharam #JayaBachchan @AzmiShabana @RanveerOfficial @aliaa08 pic.twitter.com/4zhZy4l2zh— Dharma Productions (@DharmaMovies) May 25, 2023
Dilon ko dhadkaane aa rahi hai woh – the ‘Rani’ of this 'prem kahaani'!💖 #RockyAurRaniKiiPremKahaani, a film by Karan Johar in his 25th anniversary year.
In cinemas 28th July, 2023. #RRKPK @aapkadharam #JayaBachchan @AzmiShabana @RanveerOfficial @aliaa08 pic.twitter.com/fzDvJBBC2m— Dharma Productions (@DharmaMovies) May 25, 2023
Meet the newest couple in the Dharma cinematic universe – Rocky & Rani!❤️👑
Inn dono ki prem kahaani hai adhuri without their family!
STAY TUNED & MEET THEIR PARIVAAR!#RockyAurRaniKiiPremKahaani, a film by Karan Johar in his 25th anniversary year.
In cinemas 28th July, 2023 pic.twitter.com/A2Ii9U3kr3— Dharma Productions (@DharmaMovies) May 25, 2023
Do alag parivaar, ek bada dhamaka!💥
Meet the Randhawas & the Chatterjees.
#RockyAurRaniKiiPremKahaani, a film by Karan Johar in his 25th anniversary year. In cinemas 28th July, 2023.#RRKPK @aapkadharam #JayaBachchan @AzmiShabana @RanveerOfficial @aliaa08 @tota_rc pic.twitter.com/nzkgiE1Diw— Dharma Productions (@DharmaMovies) May 25, 2023
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!