పక్కా బిజినెస్ మేన్ నిర్మాత దిల్ రాజు. సినిమాను ఫర్ ఫెక్ట్ గా మార్కెట్ చేయటం రాజుకు
వెన్నతో పెట్టిన విద్య. ఇక తన సోదరుడి కుమారుడు ఆషిశ్ ను హీరోగా పరిచయం చేస్తూ దిల్
రాజు నిర్మించిన ‘రౌడీ బాయ్స్’ ఈ సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఆడియన్స్ పల్స్ తెలిసిన దిల్ రాజు ఇందులో పాటలను ప్రముఖ హీరోలతో లాంచ్ చేయిస్తూ వస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అల్లు అర్జున్ విడుదల చేసిన డేట్ నైట్ సాంగ్ కు కూడా చక్కటి ఆదరణ లభిస్తోంది. ఇక దీనికి ముందు విడుదల చేసిన ‘బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే…’ పాటకి పేరడిగా సోషల్ మీడియాలో వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. వీటితో పాటు ‘ప్రేమే ఆకాశమైతే…’ పాట కూడా యూత్ కి బాగా పట్టేసింది. ఇదిలా ఉంటే ఇందులో హీరో బృందం పాడే మెడ్లీ యూత్ కి కిరాక్ తెప్పిస్తుందంటున్నారు. ఇందులో అందరు హీరోల పాటల రీమిక్స్ ని పొందుపరచటం విశేషం. ఈ సినిమా టైటిల్ వినగానే ఇదేదో కాలేజ్ కొట్లాట అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ‘రౌడీ బాయ్స్’ అనేది హీరో, అతగాడి బృందం బ్యాండ్ పేరు. అందులో భాగంగానే టాప్ స్టార్స్ పాటలతో మెడ్లీ ఉంటుందన్నమాట. అందరు హీరోల ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం అన్నమాట.
దిల్ రాజు దిమాక్ చూపించింది ఇక్కడే. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున ఇలా అందరు హీరోల హిట్ సాంగ్స్ ఈ మెడ్లీలో చోటు చేసుకోవడం గమనార్హం. తన వారసుడి తొలి చిత్రం కావటంతో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావటం లేదు. లవ్, యాక్షన్, యూత్, ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నింటినీ రంగరించి ఆడియన్స్ మీదకు వదులుతున్న అస్ర్తమే ‘రౌడీ బాయ్స్’. సెన్సార్ లోనూ పాజిటీవ్ టాక్ రావటం ఓ విధంగా దిల్ రాజు నమ్మకాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. ‘హుషారు’ ఫేమ్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. మరి ‘రౌడీ బాయ్స్’ సంక్రాంతి విజేతగా నిలుస్తాడా? లేదా? అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.