NTV Telugu Site icon

Ravikanth Parepu: ‘క్షణం’ దర్శకుడి మూడో చిత్రం ఎవరితో అంటే..

Roshan (2)

Roshan (2)

Ravikanth Parepu: “క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల” వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు రవికాంత్ పేరేపు. తాజాగా అతను మూడో సినిమాకు శ్రీకారం చుట్టాడు. మహేశ్వరి మూవీస్ బ్యానర్‌లో పి. విమల ఓ సినిమాను రవికాంత్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒకటి రెండు చిత్రాలలో కీ-రోల్స్ ప్లే చేసిన ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. బుధవారం అతని పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు రోషన్ కనకాల కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో రోషన్ డి. జె.గా వైబ్రెంట్ అవతార్ లో ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం న్యూ ఏజ్ రోమ్-కామ్‌గా రూపొందుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, నవీన్ యాదవ్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. రవికాంత్ పేరేపు తో పాటు, విష్ణు కొండూరు, సెరి-గన్ని దీనికి రచన చేస్తున్నారు. వంశీ కృష్ణ స్క్రీన్ ప్లే కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నారు. శివమ్‌రావు ప్రొడక్షన్‌ డిజైన్‌ నిర్వహిస్తునారు.

Show comments