Ronith Roy : ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జైలవకుశలో విలన్ గా చేసిన రోనిత్ రాయ్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాతో ఆయన తెలుగు నాట మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అటు బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన చరిత్ర ఆయనకు ఉంది. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ఆయన చాలా ఫేమస్. తాజాగా తన లైఫ్ జర్నీ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు రోనిత్ రాయ్. నేను సినిమాల్లోకి రావడం అంత ఈజీగా జరగలేదు. మొదట్లో చాలా కష్టాలు పడ్డాను. ఎవరూ పెద్దగా అవకాశాలు ఇచ్చేవారు కాదు.
Read Also : Rajinikanth : కమలహాసన్ అంత మేధావిని కాదు నేను.. రజనీకాంత్ కామెంట్స్ వైరల్ !
కావాలని నన్ను తిప్పించుకునేవారు. అది నాకు బాధగా అనిపించేది. అయినా సరే పట్టువదలకుండా తిరిగాను. సినిమాల్లోకి రాకముందు తినడానికి సరిగ్గా డబ్బులు కూడా ఉండేవి కాదు. బాంద్రా స్టేషన్ దగ్గర్లో ఉండే ఓ దాబాలో రోజూ రెండు రోటీలు ఒక కర్రీ తిని పడుకునేవాడిని. ఒక్క పూట మాత్రమే తినేవాడిని. ఓ రోజు డబ్బులు లేక రెండు రోటీలు మాత్రమే తీసుకున్నా. ఆ హోటల్ యజమాని కూర ఫ్రీగా ఇచ్చాడు. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు అని అర్థం చేసుకున్నాడు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఇబ్బందులు తప్పలేదు. మొదట్లో హిట్లు పడలేదు. అవకాశాలు రాలేదు. నేను ఎవరినీ అడగకపోవడం వల్ల రావట్లేదేమో అనుకున్నాను. నాకు నేనే సర్ది చెప్పుకుని అవకాశాల కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఇప్పటికీ మంచి సినిమాలు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు రోనిత్.
Read Also : Lenin : అఖిల్ లెనిన్ మూవీ అప్డేట్ – హీరోయిన్ ఛేంజ్ పై క్లారిటీ
