ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ కొనడానికి రెండు సినిమాలు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి నాగశౌర్య “వరుడు కావలెను”, రెండవది ఆకాష్ పూరి “రొమాంటిక్”. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పివిడి ప్రసాద్ సమర్పణలో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వంశీ నిర్మించిన ఈ సినిమాకు అటు ఇండస్ట్రీలోనూ ఇటు ఆడియన్స్ లోనూ మంచి బజ్ ఉంది. నిన్న రాత్రి జరిగిన ‘వరుడు కావలెను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ పాల్గొనడం సినిమాపై లాస్ట్ మినిట్ లో అంచనాలను పెంచేసిందంటే చెప్పాలి. ఇక టీజర్, ట్రైలర్ చూస్తుంటే సినిమా డీసెంట్ గా ఉండడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కధాంశమని అర్థమవుతోంది.
మరోవైపు డాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి నటిస్తున్న తాజా చిత్రం “రొమాంటిక్”. ఈ సినిమాకు పూరి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే అందించగా అనిల్ పాడూరి దర్శకత్వం వహించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాను నిర్మించారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా సునీల్ కాశ్యప్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తుంటే యూత్ ను టార్గెట్ చేసినట్టుగా అన్పిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మసాలా, యాక్షన్ యూత్ కు కావలసినంత దట్టించాడు దర్శకుడు. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీమియర్ షోలు జరగగా రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడు సినిమాను వీక్షించి ప్రశంసలు కురిపించారు.
Rea also : పుష్ప : దుమ్మురేపుతున్న “నా సామీ రారా సామీ” సాంగ్
రన్ టైం, ప్రీ రిలీజ్ బిజినెస్
ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నా ఈ రెండు చిత్రాలకు కుడి షార్ప్ రన్‌టైమ్‌లు ఉన్నాయని తెలిసింది. ‘రొమాంటిక్’ సినిమా నిడివి 2 గంటల 12 నిమిషాలు అయితే, ‘వరుడు కావలెను’ రన్ టైం 2 గంటల 13 నిమిషాలు. రెండు సినిమాల మధ్య కేవలం ఒకే ఒక్క నిమిషం తేడా ఉంది. ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే… ప్రపంచవ్యాప్తంగా “రొమాంటిక్” థియేట్రికల్ రైట్స్ రూ.5 కోట్లకు అమ్ముడవ్వగా, “వరుడు కావలెను” రైట్స్ మాత్రం రూ.10 కోట్లు పలికాయి. అంటే ఆకాష్ పూరీ సినిమా రూ. 5 కోట్ల కంటే ఎక్కువ, నాగశౌర్య రూ.10 కోట్ల కంటే ఎక్కువ రాబట్టాల్సి ఉంటుంది.
రెండు విభిన్న జోనర్లు
రొమాంటిక్, వరుడు కావలెను చిత్రాలు రెండూ రెండు ధృవాల్లాగా రెండు విభిన్నమైన జోనర్లలో వస్తున్న చిత్రాలు. రొమాంటిక్ పూర్తిగా యాక్షన్, క్రైమ్ రొమాంటిక్ నేపథ్యంలో వస్తున్న మూవీ. ఇక ‘వరుడు కావలెను’ మాత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆకాష్ పూరీకి “మెహబూబా’తో గట్టి దెబ్బ తగలడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి హీరోగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇక నాగశౌర్య “ఓ బేబీ”, “అశ్వద్ధామ” వంటి చిత్రాలతో వరుస విజయాలు సాధించారు. ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోగా మంచి క్రేజ్, తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్నాడు. మరి ప్రేక్షకులు ఈ ఫ్రైడే వార్ లో ఏ హీరోకు పట్టం కడతారో ? బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మూవీ కనక వర్షం కురిపిస్తుందో చూడాలి.