రోహిత్ శెట్టి & రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబో రిపీట్ కాబోతోంది. ముంబై ఎక్స్ పోలీస్ కమీషనర్ జీవితకథ ఆధారంగా సినిమాను రూపొందించబోతున్నట్టుగా ఈ కాంబో అధికారికంగా వెల్లడించింది. మాజీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాకేష్ మారియా తన కెరీర్‌లో సాధించిన సక్సెస్ ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ప్రముఖ చిత్రనిర్మాత రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా రోహిత్ శెట్టి మాట్లాడుతూ “రాకేష్ మారియా… 36 ఏళ్లుగా ఆయన అద్భుతమైన ప్రయాణంలో 1993 ముంబైలో జరిగిన పేలుళ్ల నుండి, అండర్ వరల్డ్ ముప్పు, 2008లో 26/11 ముంబై ఉగ్రదాడుల వరకు ఎన్నో చూశారు. ఈ నిజ జీవిత సూపర్ కాప్ ధైర్య, నిర్భయ ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను!! ” అంటూ బయోపిక్ పై అధికారిక ప్రకటన చేశారు.
Read Also : Mega154 : టైటిల్ లీక్ చేసిన మెగాస్టార్
IPS అధికారి అయిన రాకేష్ మారియా 1981 బ్యాచ్ నుండి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1993లో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్)గా ఉన్న ఆయన బాంబే వరుస పేలుళ్ల కేసును ఛేదించాడు. తరువాత ముంబై పోలీస్ DCP (క్రైమ్), ఆ తర్వాత జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) అధికారిగా మారారు. 2003 గేట్‌వే ఆఫ్ ఇండియా, జవేరీ బజార్ జంట పేలుళ్ల కేసును మారియా సాల్వ్ చేశారు. 2008లో 26/11 ముంబై దాడులను పరిశోధించే బాధ్యతను కూడా మరియాకు అప్పగించారు. ఆయన సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను విచారించి, కేసును విజయవంతంగా పరిశోధించారు.