ఈ యేడాది మార్చి మొదటి వారంలో ‘షాదీ ముబారక్’ మూవీతో జనం ముందుకు వచ్చిన ఆర్. కె. సాగర్ ఇప్పుడు ‘ది 100’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందనున్న ది 100 సినిమాలో ఆర్.కె. సాగర్.. విక్రాంత్ అనే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఖాకీ యూనిఫామ్‌లో చేతిలో గన్ పట్టుకుని వెనక్కి తిరిగి నిలబడిన ఆర్. కె. సాగర్ లుక్ చాలా ఇన్టెన్స్గా ఉంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా ఫిట్ లుక్‌తో కనిపించడానికి సాగర్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారని, సినిమా హై యాక్షన్ మూవీగా రూపొందనుందని పోస్టర్‌ను చూస్తే అర్థమవుతుంది. ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌కు శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఆర్.కె. మీడియా వర్క్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.