RK Roja: బాలకృష్ణపై మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja fires on Balakrishna: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్ మీట్ గురించి స్పందించిన మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ గారి ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరూ ఇన్ని రోజులు వెన్నుపోటు దారుడు ఆ సీట్లో కూర్చున్నాడు, ఇప్పుడు మెంటల్ గాడు కూర్చున్నాడు అనుకుంటున్నారు. అది నేను చెప్పిన మాట కాదు, ఎందుకంటే బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు బాలకృష్ణ గారు కోర్టుకు సమర్పించిన తన ఆఫడిఫిట్ లో తానే నేను మానసిక వ్యాధిగ్రస్తుడిని ఈ దేశంలో ఉన్న నాలుగు మెంటల్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్నాను అని సెల్ఫ్ సర్టిఫైడ్ సైకోగా ఆయన ఆఫడిఫిట్ ఇచ్చారని అన్నారు. అలాంటి మెంటల్ స్టేటస్ ఉన్న బాలకృష్ణ గారు ఈరోజు నేను తెలుగువారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతాను అంటే ఆ తెలుగుదేశం పార్టీ వారందరూ మా పరిస్థితి ఏమైపోతుందో అని భయపడుతున్నారు.
Natti Kumar: చంద్రబాబు అరెస్ట్.. సినీ పెద్దలు ఖండించకపోవడం దారుణం!
పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది మా పరిస్థితి అని మాట్లాడుకుంటున్నారని రోజా పేర్కొన్నారు. ఈరోజు బాలకృష్ణ గారికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, తెలుగు వారి కోసం పోరాడుతాను తెలుగు వాడి పౌరుషం ఏంటో చూపించండి అంటున్నారు కదా ఈరోజు దొంగలాగా సాక్షాధారాలతో దొరికిన మీ బావ కోసం నువ్వు పోరాడితే తెలుగువారి కోసం తెలుగు వారి పౌరుషం కోసం పోరాడినట్లు కాదని అన్నారు. నీ తండ్రి ఎన్టీ రామారావు గారు తెలుగువాడి పౌరుషం ఏంటో ఢిల్లీకి చూపించే విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వారికి అండగా ఉంటే ఆయన దగ్గర నుంచి పార్టీ లాక్కొని వైస్రాయ్ హోటల్ లో ఆయనపై చెప్పులు వేసి, అసెంబ్లీలో ఆయన వద్ద మైక్ లాక్కుని ఆయన కంటి నీరు వచ్చేలా చేసిన చంద్రబాబు మీద నువ్వు కనుక పోరాటం చేసి ఉంటే తెలుగు వారందరూ సంతోషించి ఉండేవారని అన్నారు.
Also Read
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
హైదరాబాదులో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి చంద్రబాబుతో పాటు దొంగలాగా కరకట్టకి పారిపోకుండా ధైర్యంగా నువ్వు నిలబడి పోరాడి ఉంటే తెలుగు వారి పౌరుషం తెలుగు వారి సత్తా ఏంటో అందరూ అర్థం చేసుకొని అభినందించి ఉండేవారని అన్నారు. అలాగే ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని నీ బావ చంద్రబాబు నాయుడు, నీ అల్లుడు లోకేష్ ఏ విధంగా కడుపునిండా తిన్నారో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో, అప్పుడు గనక మీరు రియాక్ట్ అయ్యి పోరాడి ఉంటే తెలుగు వాడి కోసం పోరాడి నిలబడ్డాడని అందరూ సంతోషించి ఉండేవారని అన్నారు. ఈ రోజు మీరు చేస్తున్న పోరాటం ఒక దొంగను కాపాడడానికి ఒక గజదొంగని కాపాడడానికి అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నిన్న మీరు బంద్ కి పిలుపునిచ్చిన ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు బంద్ పాటించలేదని ఆమె అన్నారు.
వైస్సార్సీపీ అంతు చూస్తాను అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి రోజా రియాక్షన్..#Roja #YSRCP #AndhraPradesh #CMYSJagan #NandamuriBalakrishna #RojaSelvamani #ChandrababuArrest #CBNArrested #CBNInJail #CBN #ChandrababuNaiduArrested #NTVTelugu pic.twitter.com/E7xnSjrA2i
— NTV Telugu (@NtvTeluguLive) September 12, 2023
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!