Natti Kumar Fires on Tollywood: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం గత రెండు మూడు రోజుల నుంచి చర్చనీయాంశం అవుతోంది. ఇక ఈ అంశము మీద తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం పట్ల ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు హైదరాబాద్ లోని మీడియాతో ఆయన మాట్లాడుతూ, మొదటి నుంచి నేను కాంగ్రెస్ వాదిని, తెలుగుదేశం పార్టీని ఏ రోజు సపోర్ట్ చేయలేదు అని అన్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్న ఆయన ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ చంద్రబాబునాయుడు లాంటి అనుభజ్ఞుడు ఉంటే మంచిదని బావిస్తుంటానని అన్నారు. చంద్రబాబు ఏ రోజు కక్షసాధింపుకు పాల్పడలేదని పేర్కొన్న ఆయన 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అలాంటి వ్యక్తి జైలులో ఉండకూడదని అన్నారు. ఆయనపై పెట్టిన కేసులలో నిజాలు ఉన్నాయా? లేవా? అన్న అంశాలను కోర్టులు చూసుకుంటాయి కానీ చంద్రబాబు అరెస్టుపై తెలుగు సినీ పరిశ్రమ స్పందించకపోవడం నాకు చాలా బాధను కలిగించిందని అన్నారు.
Nara Rohith: బాలా మామకు సపోర్ట్ గా రంగంలోకి దిగిన అల్లుడు..
జూనియర్ ఎన్టీఆర్ సహా చిరంజీవి ,మురళీమోహన్, అశ్వనీదత్, రాజమౌళి, దామోదరప్రసాద్ వంటి సినీ ప్రముఖులతో పాటు సినీ పరిశ్రమ పెద్దలెవరూ చంద్రబాబు అరెస్ట్ ను ఖండించకపోవడం దారుణం అని అన్నారు. వాస్తవానికి పరిశ్రమలో చంద్రబాబు అభిమానులు, మద్దతుదారులు ఎక్కువ అనే పేరుంది వీళ్ళు అంతా చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు మాకు ఇవి కావాలి!…అవి కావాలి! అని లబ్ది పొందిన వారేనని నట్టి అన్నారు. ప్రతీ సందర్భంలోనూ సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తిగా చంద్రబాబు పేరు సంపాదించుకున్నారని పేర్కొన్న ఆయన ఓ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడుగా అండగా ఉండటం మానవత్వం అని అన్నారు. వెనుకాల నుంచి ముసుగు వేసుకుని బయటకు కనిపించకుండా సపోర్ట్ చేసేవాళ్ళు దొంగలు, ముందుండి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రమే హీరో అని అన్నారు. సినీ పరిశ్రమ పెద్దలు దొంగ ముసుగులు వేసుకోవద్దని నట్టి కుమార్ ఫైర్ అయ్యారు.